
నూతన ఎస్‌ఐల బాధ్యతల స్వీకరణ
తాండూరు రూరల్/యాలాల: తాండూర్ సబ్ డివిజన్ పోలీస్‌స్టేషన్‌లలో కరన్‌కోట్ ,పెద్దేముల్, యాలాల ఠాణాలకు డీఐజీ ఇక్బాల్ నూతన ఎస్‌ఐలను నియమించారు. కరన్‌కోట్‌లో పనిచేసిన ఎస్‌ఐ విఠల్‌రెడ్డిని వికారాబాద్ సీసీఎస్‌గా బదిలీచేశారు. ఆయన స్థానంలో ఇటీవల ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఎస్‌ఐ రాథోడ్ వినోద్‌ను నియమించారు. ఆదివారం బాధ్యతలు స్వీకరించిన ఆయన్ను యువ నాయకుడు అశోక్ సన్మానించారు.
పెద్దేముల్ ఎస్‌ఐగా వేణుకుమార్
పెద్దేముల్ పోలీస్‌స్టేషన్ నూతన ఎస్‌ఐగా కడల వేణుకుమార్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేసిన ఎస్‌ఐ ప్రశాంత్ వర్ధన్‌ను కొడంగల్ ఠాణాకు బదిలీ అయ్యారు. వేణుకుమార్ మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతీ ఒక్కరు సహకరించాలని కోరారు.
యాలాల ఎస్‌ఐగా విఠల్
యాలాల: ఠాణా నూతన ఎస్‌ఐగా విఠల్ బాధ్యతలు తీసుకున్నారు. గతంలో ఇక్కడ విధులు నిర్వ హించిన గిరి వికారాబాద్ పట్టణ ఎస్‌ఐగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఇక్కడికి వచ్చిన విఠల్, ఠాణా బాధ్యతలను గిరి నుంచి తీసుకు న్నారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు.

నూతన ఎస్‌ఐల బాధ్యతల స్వీకరణ

నూతన ఎస్‌ఐల బాధ్యతల స్వీకరణ