
పీచు మిఠాయి.. వెనక గంజాయి!
తాండూరు టౌన్: పీచు మిఠాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తి వద్ద నుంచి పోలీసులు గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో బుధవారం వెలుగుచూసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు వ్యక్తులు పట్టణంలో కొన్ని రోజులుగా పీచు మిఠాయి విక్రయిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా అనుమానం వచ్చిన పోలీసులు దినేష్‌నాయక్ అనే వ్యక్తిని తనిఖీ చేయగా అతని వద్ద 45 గంజాయి చాక్లెట్లు లభించాయి. అతన్ని అదుపులోకి తీసుకుని, గంజాయి చాక్లెట్లు ఎక్కడి నుంచి వచ్చాయి..? ఎక్కడెక్కడ వీటిని విక్రయిస్తున్నారు..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దినేశ్‌నాయక్ పట్టుబట్టాడనే విషయం తెలుసుకున్న మరో నలుగురు పరారీ అయినట్లు తెలిసింది.

పీచు మిఠాయి.. వెనక గంజాయి!