సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

Jul 18 2025 1:31 PM | Updated on Jul 18 2025 1:31 PM

సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

దోమ: అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం దోమ మండలం దాదాపూర్‌లో రూ.75 కోట్లతో గడిసింగాపూర్‌ – రంగారెడ్డిపల్లి బీటీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు వేయడం ద్వారా ప్రజలకు మెరుగైన రవాణా వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. పరి గి, షాద్‌నగర్‌, వికారాబాద్‌ రోడ్లను నాలుగు లేన్లగా అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామానికీ బీటీ రోడ్లు వేస్తామని తెలిపారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. లబ్ధిదారులు సకాలంలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మాలి విజయ్‌కుమార్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ యాదవరెడ్డి, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అనసూయమ్మ, ఏఎంసీ డైరెక్టర్లు ప్రభాకర్‌రెడ్డి, శాంతు కుమార్‌, బద్రీ, డీసీసీ ఉపాధ్యక్షులు రాములు నాయక్‌, బాల్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి రమేశ్‌గౌడ్‌, గ్రామ అధ్యక్షుడు శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రుణాలు

పూడూరు: రపతి గ్రామంలో అభివృద్ధి పనులు, అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం పూడూరు మండలంలో పల్లె పల్లెకు అభివృద్ధి అనే కార్యక్రమం నిర్వహించారు. ఎన్కేపల్లి, గొంగుపల్లి, మన్నేగుడ, కొత్తపల్లి, మేడికొండ తదితర గ్రామాల్లో రూ.2.50 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఎన్కేపల్లిలో చంద్రకళ, శీరీష నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి మహిళా సంఘాల ద్వారా రుణాలు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ సతీష్‌రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు ఆనందం, రఘునాథ్‌రెడ్డి, కార్యదర్శులు శ్రీనివాస్‌రెడ్డి, షకీల్‌, శ్రీనివాస్‌, పెంటయ్య, అజీం పటేల్‌, పార్టీ మండల అధ్యక్షుడు సురేందర్‌ ముదిరాజ్‌, నాయకులు నర్సింహారెడ్డి, అబ్బాస్‌, బాలమణి, వేణుగోపాల్‌, రాములు, సుభాష్‌ తదితరులు పాల్గొన్నారు.

పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి

గడిసింగాపూర్‌ – రంగారెడ్డిపల్లి బీటీ రోడ్డు పనులు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement