
వార్డుల విభజన లేనట్లే!
వార్డుల్లో మార్పు ఉండదు
మున్సిపల్ పరిధిలో 36 వార్డులున్నాయి. వాటి ప్రకారమే ఓటరు జాబితా సిద్ధం చేశాం. ఇతర మున్సిపాలిటీలలో వార్డుల విభజ న చేశారు. కానీ తాండూరు లో ఎలాంటి మార్పు చేయడం లేదు. మున్సిపల్ ఎన్నికల కోసం ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేశాం. ఎన్నికల నోటిఫికేషన్ రావడమే తరువాయి.
– విక్రంసింహారెడ్డి, కమిషనర్, తాండూరు
తాండూరు: మున్సిపల్ ఎన్నికల కోసం అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఎన్నికలకు వెళ్లేందుకు రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలలో వార్డుల పునర్విభజన చేపట్టారు. అందులో భాగంగా జిల్లాలోని పరిగి మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజన చేశారు. మిగతా మూడు మున్సిపాలిటీలలో మాత్రం ఎలాంటి మార్పు లేకుండా యథాతథంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తున్నారు. పరిషత్ ఎన్నికల తర్వాత మున్సిపల్ ఎన్నికలను నిర్వహించేందుకు మున్సిపల్ శాఖ అధికారులు సమాయత్తమవుతున్నారు. అయితే తాండూరు మున్సిపాలిటీలో ఉన్న వార్డులతోనే ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో కొత్తగా ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారికి నిరాశే ఎదురవుతోంది.
85,063 మంది జనాభా
తాండూరు మున్సిపల్ పరిఽధి 29.9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. మున్సిపాలిటీలో 16,309 గృహాలున్నాయి. 2019లో జరిగిన మున్సిపల్ పునర్విభజనలో 36 వార్డులు ఏర్పడ్డాయి. శివారు ప్రాంతాలు మున్సిపాలిటీలోకి విలీనం అయ్యాయి. మొత్తం జనాభా 85,063 మంది ఉండగా అందులో పురుషులు 41,504 మంది 43,559 మంది మహిళలున్నారు. అయితే ఓటరు జాబితా ప్రకారం మున్సిపాలిటీలో పురుషులు 31,677 మంది ఓటర్లు, మహిళలు 32,508 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం ఓటర్లు 64,185 మంది ఓటర్లు మున్సిపల్ పరిధిలో ఉన్నారు.
ఏర్పాట్లలో సిబ్బంది
మున్సిపల్ పరిధిలో ప్రస్తుతం ఉన్న వార్డుల్లో ఉన్న ఓటరు జాబితా ప్రకారమే ఎన్నికలను నిర్వహించేందుకు మున్సిపల్ అధికారులు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించారు. దీంతో వార్డుల విభజన లేనట్లేనని అధికార వర్గాలు పేర్కొన్నాయి. కాగా జిల్లాలో తాండూరు, పరిగి, కొడంగల్, వికారాబాద్ మున్సిపాలిటీలు ఉండగా అందులో మూడింటిలో ప్రస్తుతం ఉన్న వార్డుల ఓటరు జాబితా ప్రకారమే ఎన్నికలను నిర్వహిస్తున్నారు. పరిగి మున్సిపాలిటీలో మాత్రం వార్డుల విభజన చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పదవీకాలం ముగియకముందే మున్సిపాలిటీలకు ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించింది.
తాండూరులో ఓటర్ల వివరాలు
తాండూరులో
ఓటరు జాబితా సిద్ధం
ఆశావహుల్లో నెలకొన్న నిరాశ
ఎన్నికల నోటిఫికేషన్ కోసం
ఎదురుచూపులు

వార్డుల విభజన లేనట్లే!