కేజీబీవీలో అడిషనల్‌ కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

కేజీబీవీలో అడిషనల్‌ కలెక్టర్‌

Jul 17 2025 9:04 AM | Updated on Jul 17 2025 9:04 AM

కేజీబ

కేజీబీవీలో అడిషనల్‌ కలెక్టర్‌

తాండూరు రూరల్‌: పెద్దేముల్‌ మండలం మారెపల్లి గేటు వద్ద ఉన్న కేజీబీవీ పాఠశాలను జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ సుధీర్‌ బుధవారం సందర్శించారు. హాస్టల్లో వంట గది, స్టోర్‌ రూంలను పరిశీలించారు. సరుకుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హాస్టల్లో ఉన్న ప్రతి విద్యార్థిపై శ్రద్ధ వహించాలన్నారు. వర్షాకాలం సందర్భంగా భోజన విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ తర్వాత విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారిణి సత్యనారాయణ, ఎంపీడీఓ రతన్‌సింగ్‌, స్పెషలాఫీసర్‌ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

కల్లు దుకాణంలో తనిఖీ

ధారూరు: మండల కేంద్రంలోని రాములుగౌడ్‌ కల్లు దుకాణాన్ని బుధవారం ఎకై ్సజ్‌ శాఖ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. దుకాణంలో విక్రయిస్తున్న కల్లు శాంపిల్స్‌ను సేకరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. 10 నుంచి 15 రోజుల కల్లు నిల్వ ఉంచరాదని, దానిలో నిషేధిత మత్తు పదార్థాలను కలుపరాదని సూచించారు. కలుషిత నీరు కల్లులో వాడరాదని, స్వచ్ఛమైన నీటినే వాడాలన్నారు. కల్లు దుకాణ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని చెప్పారు. కార్యక్రమంలో తాండూరు ఎకై ్సజ్‌ సీఐ శ్రీనివాస్‌, సిబ్బంది ఉన్నారు.

ఎకై ్సజ్‌ సోదాలు

తాండూరు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం కల్లు తయారీలో ప్రమాణాలు పాటించాలని ఎకై ్సజ్‌ శాఖ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఎకై ్సజ్‌ ఇన్‌చార్జ్‌ సీఐ శ్రీనివాస్‌, అధికారులతో కలిసి బుధవారం ఆయన పట్టణంలోని కల్లు దుకాణాన్ని తనిఖీ చేశారు. కల్లు సీసాలు శుభ్రంగా లేకపోవడంపై అసహనం వ్యక్తంచేశారు. అనంతరం కల్లు శాంపుల్స్‌ సేకరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై నిజామొద్దీన్‌, సిబ్బంది భీమయ్య, రవికిశోర్‌, రవికిరణ్‌, హనుమంతు తదితరులు ఉన్నారు.

భవిష్యత్‌ అంతా బాలికలదే

తాండూరు తహసీల్దార్‌ తారాసింగ్‌

తాండూరు రూరల్‌: రాబోయే రోజుల్లో భవిష్యత్‌ అంతా బాలికలదేనని తహసీల్దార్‌ కేతావత్‌ తారాసింగ్‌ అన్నారు. బుధవారం మండల పరిధిలోని చెన్‌గేస్‌పూర్‌ మార్గంలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల వసతి గృహాన్ని ఆయన సందర్శించారు. వంట గదిని పరిశీలించి సామగ్రిని పరిశుభ్రంగా ఉంచాలని నిర్వాహకులను ఆదేశించారు. ఆ తర్వాత విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ మాట్లాడుతూ.. బాలికలు చదువుకు దూరం కావొద్దనే ఉద్దేశంతోనే ప్రభుత్వాలు ప్రత్యేక గురుకుల వసతి గృహాలు ఏర్పాటు చేశారన్నారు. హాస్టల్‌లో ఉంటూ కష్టపడి చదవి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్లో ఉంటున్న పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. బాలికల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ శివగీత, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

పశువులు తరలిస్తున్న కంటైనర్‌ సీజ్‌

కడ్తాల్‌: అక్రమంగా పశువులను తరలిస్తున్న కంటైనర్‌ను పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. విజయవాడ నుంచి ఓ కంటైనర్‌లో అనుమతి లేకుండా హైదరాబాద్‌కు పశువులు తరలిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు కడ్తాల్‌ సమీపంలో వాహనాన్ని తనిఖీ చేశారు. కంటైనర్‌లో 64 ఆవులు, 41 ఎద్దులు ఉన్నట్లు గుర్తించారు. ఇరుకు స్థలంలో ఊపిరాడక 4ఆవులు మృతిచెందాయన్నారు. పశువులను జియాగూడ కామధేను సమర్థ గోశాలకు తరలించారు.

కేజీబీవీలో అడిషనల్‌ కలెక్టర్‌ 1
1/1

కేజీబీవీలో అడిషనల్‌ కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement