జన జాతరను జయప్రదం చేద్దాం
కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్కయ్య
తాండూరు టౌన్: కులవివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా ఈ నెలలో నిర్వహించనున్న ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటాల్లో భాగంగా పూలే, అంబేడ్కర్ జనజాతరను జయప్రదం చేయాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్కయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం జనజాతరకు సంబంధించిన కరపత్రాన్ని తాండూరులో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటికీ దళితులకు దేవాలయ ప్రవేశం లేని, బతుకమ్మ ఆడనివ్వని, క్షవరం చేయని, జమ్మి ఆకు తెంపనివ్వని, హోటళ్లలో రెండు గ్లాసుల విధానం వంటి కులవివక్ష రూపాలు కొనసాగుతున్నాయన్నారు. ఈ నెలలో మహనీయుల జనజాతర కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా చేపట్టి కులవివక్ష, అంటరానితనాన్ని సమూలంగా నిర్మూలించేందుకు ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురానున్నట్లు చెప్పా రు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు సురేష్, నర్సింలు, శేఖర్, బందెప్ప, గురు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ ఫలితాలు సాధించాలి
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేష్‌రెడ్డి
కొడంగల్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి తల్లిదండ్రులు, పాఠశాలకు పేరు తేవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేష్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ జగదీశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నందారం ప్రశాంత్ అన్నారు. జగదీశ్వర్‌రెడ్డి సొంత డబ్బులతో ప్రత్యేకంగా తయారు చేయించిన పరీక్ష ప్యాడ్లు, పెన్నులను గురువారం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలల్లోని 6, 7, 8, 9 తరగతి విద్యార్థులకు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ త్వరలో వార్షిక పరీక్షలు ఉన్నందున విద్యార్థులు శ్రద్ధగా ఏకాగ్రతతో రాయాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొడంగల్ నియోజకవర్గాన్ని ఎడ్యూకేషన్ హాబ్‌గా మారుస్తున్నారని అన్నారు. ఈ ప్రాంతంలో అన్ని రకాల ప్రభుత్వ రంగ విద్యా సంస్థలు ఏర్పాటు చేసి ఉచితంగా విద్యను అందించడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ శివకుమార్ గుపా, ఎంఈఓ రాంరెడ్డి, లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు మురహరి వశిష్ట, నాయకులు దాము, వెంకటయ్య గౌడ్, మునీర్, ఆనంద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పాంబండ హుండీ ఆదాయం లెక్కింపు
కుల్కచర్ల: మండలంలోని బండవెల్కిచర్ల గ్రామ పరిధిలో వెలసిన శ్రీ పాంబండ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఆలయ చైర్మన్ కోట్ల మైపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆలయంలో జాతర హుండీ ఆదాయాన్ని లెక్కించారు. భక్తులు రూ. 3,36,895లు సమర్పించినట్లు తెలిపారు. స్వా మివారికి అందించిన కోడెలను వేలం వేయగా రూ.64వేల 5వందలు వచ్చిందన్నారు. ఈ కోడెలను వ్యవసాయానికి మాత్రమే వినియోగించాలని, విక్రయించరాదని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ బాలనర్సయ్య, మర్పల్లి కార్యనిర్వాహణాధికారి శాంతికుమార్, అర్చ కులు పాండు శర్మ, భక్తులు పాల్గొన్నారు.
పశుసంవర్ధక శాఖ ఏడీ ప్రవీణ్ బదిలీ
తాండూర్ రూరల్: పశుసంవర్ధక శాఖ తాండూరు ఏడీగా పని చేస్తున్న ప్రవీణ్ శుక్రవారం బదిలీ అయ్యారు. ఈ మేరకు జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయానికి బదిలీపై వెళ్లారు. కొడంగల్ ఏడీ డాక్టర్ నోహాకు తాండూరు బాధ్యతలు అప్పగించారు.
జన జాతరను జయప్రదం చేద్దాం
జన జాతరను జయప్రదం చేద్దాం


