తిరుపతి ఎడ్యుకేషన్ : జాతీయ స్థాయి ఉషు పోటీలకు తిరుపతికి చెందిన రమ్యశ్రీ ఎంపికై ంది. ఇటీవల రాజమండ్రిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఉషు పోటీలోల బాలికల జూనియర్ విభాగంలో రమ్యశ్రీ స్వర్ణ పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. బాలుర జూనియర్ విభాగంలో టి.చంద్రశేఖర్ కాంస్యం, సీనియర్ పురుషుల విభాగంలో వి.చక్రవర్తి వెండి, కె.గంగాధర్, ఓ.మునేంద్రలు కాంస్య పతకాలు సాధించి ప్రతిభను చాటారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటిన వీరిని తిరుపతి జిల్లా ఉషు స్పోర్ట్స్ అకాడమీ అధ్యక్షులు పి.గీత, కోచ్ కె.గోపినాయుడు అభినందించారు.


