నృసింహ తేజం.. శ్రీకృష్ణరూపం | - | Sakshi
Sakshi News home page

నృసింహ తేజం.. శ్రీకృష్ణరూపం

Oct 15 2026 11:53 AM | Updated on Oct 15 2026 11:53 AM

● వైభవంగా కల్యాణ వెంకన్న నవరాత్రి బ్రహ్మోత్సవాలు

తిరుపతి రూరల్‌: తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. మూడో రోజు బుధవారం వాహన సేవలు కన్నుల పండువగా సాగాయి. ఉదయం సింహ వాహనంపై యోగ నరసింహుడిగా.. రాత్రి ముత్యపు పందిరిపై బాలకృష్ణుడిగా దర్శనమిచ్చారు. సింహ వాహనంపై యోగ నరసింహుడి అలంకారంలో కొలువుదీరిన కల్యాణ వెంకన్నను దర్శించుకున్న భక్తులు పరవశించారు. చెవిరెడ్డితో కలిసి మోహిత్‌రెడ్డి, హర్షిత్‌ రెడ్డి తమ భుజాలపై సింహ వాహనం మోస్తూ గోవింద నామస్మరణతో ముందుకు సాగారు. రాత్రి ముత్యపు పందిరి వాహనంపై దేవేరులతో కలిసిబాలకృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సారె తీసుకువచ్చిన ఎల్‌ఎస్‌ అట్రియా, వరరూపా, స్ప్రింగ్‌ హుడ్‌ అపార్ట్‌మెంట్‌ వాసులకు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, లక్ష్మి దంపతులు సాదర స్వాగతం పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement