6న దీపావళి కఽథల పోటీలు | - | Sakshi
Sakshi News home page

6న దీపావళి కఽథల పోటీలు

Oct 15 2026 11:53 AM | Updated on Oct 15 2026 11:53 AM

తిరుపతి కల్చరల్‌ : తిరుపతి జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో దీపావళిని పురస్కరించుకుని నవంబర్‌ 6న దీపావళి కథల పోటీలకు కథలు ఆహ్వానిస్తున్నట్లు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తోట వెంకటేశ్వర్లు, మన్నవ గంగాధరప్రసాద్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలను 6న సాయంత్ర 5.45 గంటలకు యూత్‌ హాస్టల్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కథలు 400 పదాలకు మించకుండా వేదికపై చదవాలని అక్కడే న్యాయనిర్ణేతలు వారి నిర్ణయం ప్రకటిస్తారని తెలిపారు. విజేతలకు వరుసగా రూ.1,000 రూ.750, రూ.500 బహుమతిగా అందజేయనున్నట్లు వివరించారు.

సర్‌.. 30న తుది ఓటర్ల జాబితా

తిరుపతి అర్బన్‌ : ప్రత్యేక సమగ్ర సవరణ ఓటర్ల తుది జాబితాను ఈనెల 16న వెల్లడించాల్సి ఉంది. అయితే ఈ నెల 30న ప్రచురించనున్నట్లు కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలో ఈ నెల 22 తేదీ వరకు సర్‌కు సంబంధించి నోటీస్‌ దశ, క్లెయిమ్స్‌, అభ్యంతరాల పరిష్కారం చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఓటర్లు గుర్తించాలని ప్రకటనలో పేర్కొన్నారు.

జూడోలో ఉమ్మడి జిల్లా జట్టు ప్రతిభ

తిరుపతి రూరల్‌ : రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్‌ అండర్‌–14, అండర్‌–19 జూడో బాలబాలికల పోటీల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా సత్తా చాటింది. తిరుపతి రూరల్‌ మండలం తనపల్లెలోని శశి ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌ అండ్‌ జూనియర్‌ కాలేజీలో బుధవారం ముగింపు పోటీలు నిర్వహించారు. అండర్‌–19 బాలుర విభాగంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా విజేతగా నిలవగా, బాలికల విభాగంలో రన్నరప్‌ స్థానం దక్కించుకుంది. శశివిద్యాసంస్థల డైరెక్టర్‌ కిరణ్‌కుమార్‌, డీన్‌ హరినాథ్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా అండర్‌–19 సెక్రటరీ లోకనాథం, తిరుపతి జిల్లా సెక్రటరీలు సాంబశివరావు, అమ్ములు ఆధ్వర్యంలో పోటీలు విజయవంతంగా నిర్వహించారు.

విభాగాల వారీగా విజేతలు

అండర్‌–14 బాలుర విభాగంలో అనంతపురం జిల్లా విజేతగా, చిత్తూరు రన్నరప్‌గా నిలిచాయి. బాలికల విభాగంలో అనంతపురం మొదటి స్థానం, విశాఖపట్నం రెండో స్థానం సాధించాయి. అండర్‌–19 బాలుర విభాగంలో చిత్తూరు జిల్లా విజేతగా, కర్నూలు రన్నరప్‌గా నిలిచాయి. బాలికల విభాగంలో అనంతపురం విజేతగా, చిత్తూరు రన్నరప్‌గా నిలిచాయి. విజేతలకు ట్రోఫీలు, బహుమతులు అందించారు. పోటీల నిర్వహణలో ఆర్గనైజింగ్‌ కమిటీ సభ్యులు ప్రభాకర్‌, సుబ్రహ్మణ్యంరెడ్డి, శ్రీధర్‌, మణి, సురేష్‌, దశరథ, నాగలక్ష్మి, రూపులత, వాణి, ప్రమీల, కోచ్‌ గోపి, పీఈటీలు వెంకటేష్‌, సంధ్య పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement