రామచంద్రాపురం : మండలంలో వరుస దొంగతనాలతో కలకలం సృష్టించిన చైన్ స్నాచర్ను తిరుచానూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల చోరీలు ఎక్కువ కావడంతో అప్రమత్తమైన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. మండలంలోని అనుపల్లి పంచాయతీ గడ్డకిందపల్లి గ్రామానికి చెందిన కళావతి అనే మహిళ మెడలో సుమారు 8 సవర్ల బంగారు చైన్ను నిందితుడు లాక్కెళ్లిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న రామచంద్రపురం పోలీసులు, తిరుచానూరు పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానం, స్థానిక సమాచారం ఆధారంగా దొంగను పట్టుకున్న పోలీసులు.. బుధవారం నిందితుడిని నేరుగా బాధితురాలు కళావతి ఇంటి ముందుకు తీసుకువచ్చారు. అక్కడ ఘటనకు సంబంధించిన వివరాలపై విచారణ చేపట్టారు.


