ఎంపీ నిధులతో తాగునీటి వసతి | - | Sakshi
Sakshi News home page

ఎంపీ నిధులతో తాగునీటి వసతి

Oct 15 2026 8:00 AM | Updated on Oct 15 2026 8:00 AM

తడ: ఎంపీ గురుమూర్తి తన గ్రాంటు నుంచి అందించిన రూ.12.50 లక్షలతో 170 మత్స్యకార కుటుంబాలకు తాగునీటి వసతి కల్పించారు. ఇరకం గ్రామానికి చెందిన మత్స్యకారులకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పూడి పంచాయతీ, పూడి కుప్పంలో నివాస స్థలాలు కేటాయించారు. అక్కడ వారు ఇళ్లు నిర్మించుకున్నప్పటికీ తాగునీటి సౌకర్యం లేకపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడేవారు. విషయం తెలుసుకున్న ఎంపీ గురుమూర్తి వెంటనే నిధులు మంజూరు చేసి బోరు వేయించారు. ఈ క్రమంలో ఇంటింటికీ కొళాయి కనెక్షన్‌ ఇచ్చేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు ఎంపీ గురుమూర్తికి మత్స్యకారులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement