న్యాయపరమైన అంశాలపై అప్రమత్తం | - | Sakshi
Sakshi News home page

న్యాయపరమైన అంశాలపై అప్రమత్తం

Oct 15 2026 8:00 AM | Updated on Oct 15 2026 8:00 AM

తిరుపతి రూరల్‌ : స్థానిక ఎన్నికల నేపథ్యంలో న్యాయపరంగా అనుసరించాల్సిన విధానాలు, ఎన్నికల నియమావళి, చట్టపరమైన అంశాలపై పూర్తి అవగాహనతోపాటు అప్రమత్తంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సూచించారు. బుధవారం తుమ్మలగుంటలోని వైఎస్సార్‌సీపీ చంద్రగిరి నియోజకవర్గ కార్యాలయంలో లీగల్‌ సెల్‌ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. నామినేషన్ల దాఖలు నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలన్నారు. అభ్యర్థుల అర్హతలు, నామినేషన్ల పత్రాలు, ఎన్నికల నియమావళి అమలు వంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. న్యాయపరమైన సమస్యలు తలెత్తితే వాటిని చట్ట బద్ధమైన మార్గాల్లో పరిష్కరించేందుకు లీగల్‌ సెల్‌ సభ్యులు సిద్ధంగా ఉండాలని కోరారు. పార్టీ శ్రేణులకు అవసరమైన న్యాయ సలహాలు అందిస్తూ, ఎన్నికల నిబంధనలపై అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని దిశానిర్దేశం చేశారు. వార్డు నుంచి సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల వరకు నామినేషన్ల పత్రాలను ఒకటికి రెండు సార్లు నిశితంగా పరిశీలన చేసిన తర్వాతే దాఖలు చేయాలన్నారు. అభ్యర్థులను బరిలో కొనసాగించేలా న్యాయబద్ధంగా పోరాటం చేయాలని, అందుకు తగిన చట్టాలను అధికారులకు చూపించేందుకు తగిన దస్త్రాలను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement