తిరుపతి సిటీ: శ్రీ పద్మావతి మహిళ పాలిటెక్నిక్ కళాశాలలో స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన క్యాంపస్ డ్రైవ్లో పలువురు పాలిటెక్నికల్ విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. 2025, 2026 బ్యాచ్కు చెందిన డీఈఈఈ, డీఈసీఈ విద్యార్థులకు ఎలక్ట్రిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చేపట్టిన ఇంటర్వ్యూల్లో పాల్గొని ప్రతిభ చూపి వార్షిక వేతనం రూ.3.12 లక్షలతో ఉద్యోగాలు సొంతం చేసుకున్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.పద్మావతమ్మ ఉద్యోగాలు సాధించిన విద్యార్థినులను అభినందించారు.


