నాయుడుపేటలో క్షుద్రపూజల కలకలం | - | Sakshi
Sakshi News home page

నాయుడుపేటలో క్షుద్రపూజల కలకలం

Oct 14 2026 11:04 AM | Updated on Oct 14 2026 11:04 AM

నాయుడుపేట టౌన్‌: పట్టణంలోని మంగపతినాయుడు నగర్‌లో ఓ ఇంటి మిద్దైపె క్షుద్రపూజలు చేసిన తీరు కలకలం రేపింది. మంగపతినాయుడు నగర్‌లో రైల్వే ఉద్యోగి పేర్నాటి సురేష్‌ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. మంగళవారం సురేష్‌ విధులకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే సరికి ఇంటి మిద్దైపె గుర్తుతెలియని వ్యక్తులు నిమ్మకాయలు, పసుపు, కుంకుమతో పూజలు చేసి ఉండడాన్ని గుర్తించారు. ఇంటి మీద ఎవరో ఉద్దేశపూర్వకంగానే క్షుద్రపూజలు నిర్వహించారని సురేష్‌ కుటుంబ సభ్యులు ఆరోపించారు. పట్టణ నడిబొడ్డున నివాస ప్రాంతాల్లో క్షుద్రపూజలు చేయడంపై సమీప ప్రాంత ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయమై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

హోరాహోరీగా జూడో పోటీలు

తిరుపతి రూరల్‌: తిరుపతి రూరల్‌ మండలం, తనపల్లి సమీపంలోని శశి ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌లో 70వ రాష్ట్ర స్థాయి స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ అండర్‌–14, అండర్‌–19 బాలబాలికల జూడో పోటీలు హోరా హోరీగా సాగుతున్నాయి. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన క్రీడాకారులు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగి తమ ప్రతిభను చాటుతున్నారు. శశి విద్యాసంస్థల డైరెక్టర్‌ కిరణ్‌కుమార్‌, డీన్‌ హరినాథ్‌రెడ్డి పర్యవేక్షణలో పోటీలను నిర్వహిస్తున్నారు. పోటీలకు హాజరైన క్రీడాకారులకు మెరుగైన వసతి, రుచికరమైన భోజనం అందించడంపై నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

పట్టపగలే చోరీ

భాకరాపేట: పోలీస్‌స్టేషన్‌న్‌కు అతి సమీపంలోనే పట్టపగలు చోరీ చోటుచేసుకోవడం కలకలం రేపింది. ఇంటి తాళాలను పగులగొట్టి దొంగలు సొత్తుతో ఉడాయించారు. వివరాలు.. భాకరాపేటలోని బీసీ మోడల్‌ కాలనీకి చెందిన భాస్కర్‌ కూరగాయలు విక్రయించేందుకు మంగళవారం సంతకు వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తాళాలను పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న సుమారు 400 గ్రాముల వెండి, 12 గ్రాముల బంగారంతో పాటు నగదును అపహరించి పరారయ్యారు. సంత నుంచి తిరిగి వచ్చిన భాస్కర్‌ ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి ఆందోళనకు గురయ్యాడు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించడంతో వారు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement