సచివాలయాల్లో
ఖాళీలు అంతేనా?
తిరుపతి అర్బన్: జిల్లా వ్యాప్తంగా ఉన్న సచివాలయాల్లో 1,680 పోస్టులు ఖాళీ ఉన్నాయి. వీటిని భర్తీ చేయడంలో కూటమి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. సిబ్బంది కొరతతో ఉన్న సచివాలయ సిబ్బంది ఆపసోపాలు పడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామ,వార్డు సచివాలయాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒక్కో సచివాలయంలో పంచాయతీ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్, సర్వే అసిస్టెంట్, వీఆర్వో, వెటర్నరీ, వెల్పేర్ అసిస్టెంట్తోపాటు మహిళా పోలీస్, అగ్రికల్చర్ అసిస్టెంట్, ఏఎన్ఎం, ఇంజినీరింగ్ అసిస్టెంట్ తదితర 11 మంది ఉద్యోగులను ఏర్పాటు చేశారు. జిల్లాలోని 517 గ్రామ సచివాలయాల్లో 5,687 మంది ఉద్యోగులు, 177 వార్డు సచివాలయాల్లో 1,770 మంది ఉద్యోగులను ఏర్పాటు చేశారు. మొత్తంగా 694 సచివాలయల్లో 7,457 మంది ఉద్యోగులకు అవకాశం కల్పించారు.
కూటమి పాలనలో 1,680 ఉద్యోగాలు తగ్గింపు
చంద్రబాబు సర్కార్ సచివాలయాల ప్రాధాన్యతను తగ్గించేందుకు శ్రీకారం చుట్టింది. ముందుగా సచివాలయాల పేరును స్వర్ణ గ్రామ, వార్డులుగా మార్పు చేశారు. అనంతరం సచివాలయాల కుదింపు, ఉద్యోగుల తగ్గింపునకు శ్రీకారం చుట్టారు. మరోవైపు పదుల సంఖ్యలో అడ్డమైన సర్వే బాధ్యతలు పూర్తిగా సచివాలయ ఉద్యోగులకు కట్టబెట్టారు. అలాగే పలువురు ఉద్యోగులను డిప్యూటేషన్పై వివిధ శాఖలకు బదిలీ చేశారు. అంతేకాకుండా సచివాలయ సేవలను కుదింపు చేశారు. దీంతో ప్రస్తుతం జిల్లాలో స్వర్ణ గ్రామ సచివాలయాల్లో 1,421 ఉద్యోగాలు ఖాళీలు చూపుతున్నారు. అలాగే స్వర్ణ వార్డు సచివాలయాల్లో 259 ఖాళీలు ఉన్నాయి. మొత్తంగా 1,680 ఉద్యోగాలను తగ్గించారు. దీంతో ఉన్నవాళ్లపైనే పనిభారం పడుతోంది.


