‘వేంకటాద్రి’తో సులభంగా తిరుమల సమాచారం | - | Sakshi
Sakshi News home page

‘వేంకటాద్రి’తో సులభంగా తిరుమల సమాచారం

Oct 14 2026 12:35 AM | Updated on Oct 14 2026 12:35 AM

తిరుమల : తిరుమలకు వచ్చే భక్తులకు సమగ్ర సమాచారం, మెరుగైన సేవలందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వేంకటాద్రి యాప్‌ను ప్రారంభించినట్లు టీటీడీ ఐటీ జీఎం వేంకటేశ్వర్లునాయుడు తెలిపారు. మంగళవారం తిరుమలలోని మీడియా సెంటర్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దర్శన క్యూలైన్లను ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా పర్యవేక్షిస్తున్నామని, త్వరలో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఏఎన్‌పీఆర్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. గరుడ సేవ గ్యాలరీ పాసుల జారీకి క్యూఆర్‌ కోడ్‌ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల బుకింగ్‌పై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని కోరారు. టీటీడీ సీపీఆర్వో డాక్టర్‌ టి.రవి, శ్వేత డైరెక్టర్‌ డాక్టర్‌ వేమా వేంకటరత్నం పాల్గొన్నారు.

అదనపు ఎస్పీగా

శ్రీలత

తిరుపతి అర్బన్‌: అదనపు ఎస్పీగా శ్రీలతను నియమితులయ్యారు. ఆమె కొంతకాలంగా తిరుపతి మహిళా పోలీస్‌ స్టేషన్‌లో డీఎస్పీగా పనిచేస్తూ...తాజాగా అదనపు ఎస్పీగా పదోన్నతి పొందారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఆమె త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement