రుయాలో అదనపు క్యాజువాలిటీకి భూమి పూజ | - | Sakshi
Sakshi News home page

రుయాలో అదనపు క్యాజువాలిటీకి భూమి పూజ

Oct 14 2026 12:35 AM | Updated on Oct 14 2026 12:35 AM

తిరుపతి తుడా: రుయా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో అత్యవసర వైద్య సేవలను మరింత బలోపేతం చేయడంతో పాటు, రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించే లక్ష్యంతో రూ.కోటి వ్యయంతో అదనంగా 15 పడకల సామర్థ్యంతో నిర్మించనున్న ఎమర్జెన్సీ బ్లాక్‌కు మంగళవారం కలెక్టర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్‌, ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రస్తుతం క్యాజువాలిటీ విభాగంలో 25 పడకలు అందుబాటులో ఉండగా, రోజుకు సుమారు 300 మంది రోగులు అత్యవసర వైద్యం కోసం వస్తున్నారని తెలిపారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అదనంగా 15 పడకలతో ఎమర్జెన్సీ బ్లాక్‌ నిర్మాణానికి శ్రీకారం చూట్టామన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ బాలకృష్ణనాయక్‌, రుయా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మనోహర్‌ పాల్గొన్నారు .

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement