తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజైన సోమవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారు ఏడు తలల స్వర్ణ శేష వాహనంపై (పెద్ద శేష వాహనం) ఆశీనులై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. గోవిందనామస్మరణతో తిరుమల క్షేత్రం మార్మోగింది. సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాగా మంగళవారం ఉదయం చిన్న శేష వాహనం, రాత్రి హంస వాహనాలపై స్వామివారు కనువిందు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు పాల్గొన్నారు. – తిరుమల
అమ్మా.. భవానీ


