తిరుపతి రూరల్: విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించి, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంతో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం కీలక ముందడుగు వేసింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని నీలిట్ తిరుపతి కేంద్రంతో రెండు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల ద్వారా విద్యార్థులకు డిజిటల్ అభ్యసన వన రులు, ఆధునిక సాంకేతిక శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు సమాచారం. విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ ఉమా వెన్నం, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్.ఉష, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ పి.వెంకటకృష్ణ నీలిట్ తిరుపతి కేంద్రం డైరెక్టర్ శశికుమార్ గేరాతో సోమవారం సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. విశ్వవిద్యాలయ విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాల్లో అనుసంధానించే అంశాలపై సుధిర్ఘంగా చర్చించారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 96 అర్జీలు
తిరుపతి అర్బన్:తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 96 ఫిర్యాదులు అందినట్టు ఏఎస్పీ రవిమనోహరాచారి తెలిపారు. ఇందులో దొంగతనాలు, ఆస్తి తగాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయన్నారు. వెంటనే సంబంధిత అర్జీలు పరిష్కరించాలని ిఆయన ఆదేశించారు.


