భక్తులకు అమ్మా భగవతి దివ్య సందేశం | - | Sakshi
Sakshi News home page

భక్తులకు అమ్మా భగవతి దివ్య సందేశం

Oct 13 2026 1:53 AM | Updated on Oct 13 2026 1:53 AM

కల్కిభగవాన్‌ భక్తులను విడిచి పెట్టలేదు ఇతర లోకాల నుంచి మరిన్ని ఆశీస్సులు అందిస్తారు నాలుగు మహా సంకల్పాలను వెల్లడించిన అమ్మా భగవతి

వరదయ్యపాళెం: ఆధ్యాత్మిక గురువు కల్కిభగవాన్‌ భక్తులను ఎన్నటికీ విడిచిపెట్టలేదని, ఇతర లోకాల నుంచి మరింత శక్తివంతంగా దివ్య దర్శనం, అద్భుత అనుభూతులను ప్రసాదిస్తారని కల్కిభగవాన్‌ సతీమణి అమ్మాభగవతి భక్తులకు తన దివ్య సందేశం ద్వారా భరోసా ఇచ్చారు. ఆమె సోమవారం సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన ఓ వీడియో సందేశంలో వివరాలను వెల్లడించింది. ఈ సందర్భంగా భగవాన్‌ బతికున్న సమయంలో చేపట్టిన నాలుగు ప్రధాన సంకల్పాలను వెల్లడించారు.

మొదటి సంకల్పం: ఏకమ్‌ క్షేత్రంలో శ్రీకల్కి భగవాన్‌ దేవాలయాన్ని అత్యంత అద్భుతంగా నిర్మించాలని నిర్ణయించారు. ఈ ఆలయం ప్రపంచ వ్యాప్తంగా నిర్మించబోయే అన్ని కల్కి దేవాలయాలకు ప్రధాన కేంద్రంగా ఉంటుందని, ప్రపంచమంతా ఇదే సంప్రదాయాన్ని పాటిస్తుందని అమ్మ తెలిపారు. భక్తులందరికీ ఇది ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతుందన్నారు.

రెండవ సంకల్పం: భగవంతుని మహా సమాధి మందిర నిర్మాణం. ఈ మహా సమాధిని అత్యంత దివ్యంగా, శక్తివంతమైన క్షేత్రంగా తీర్చిదిద్దబోతున్నామన్నారు. ఆ పవిత్ర క్షేత్రాన్ని దర్శించే ప్రతి భక్తుడు అక్కడ మిరాకిల్స్‌ను, దివ్యానుభూతులను ప్రత్యక్షంగా అనుభవించేలా ఆలయాన్ని నిర్మిస్తామని చెప్పారు.

మూడవది 81,000 మందికి జ్ఞానోదయం

ప్రపంచంలో గొప్ప ఆధ్యాత్మిక మార్పు తీసుకురావడానికి 81 వేల మంది భక్తులకు జ్ఞానోదయం కలిగించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామని అమ్మ వెల్లడించారు. ఇది ఒక మహా యజ్ఞమని, దీని కోసం ప్రతి దాసాజీ, ప్రతి భక్తుడు మరింత ఉత్సాహంతో, అంకితభావంతో సేవలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

నాలుగవది : భగవద్‌ ధర్మస్థాపన.శ్రీ భగవంతుడు స్థాపించిన ఈ నూతన ఆధ్యాత్మిక మార్గానికి ‘భగవద్‌ ధర్మం’ అని నామకరణం చేశామన్నారు. ఇది కేవలం సంస్థ కాదు, మానవాళిని ముక్తి మార్గంలో నడిపించే నూతన ధర్మమని వివరించారు.

ఈ భగవద్‌ ధర్మాన్ని ముందుకు నడిపించే బాధ్యతను కుమారుడు కృష్ణాజీకి అప్పగిస్తున్నట్లు అమ్మ ప్రకటించారు. ఆయనకు ప్రీతాజీ తోడ్పాటునందిస్తారని పేర్కొన్నారు. చివరగా భక్తులకు అమ్మ హితవు పలుకుతూ, అనవసర చర్చలు, గాసిప్‌లతో సమయం వృథా చేయకుండా తమ అంతరంగ సాధనపై దృష్టి పెట్టి నిరంతరం ముందుకు సాగాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement