ఫైర్‌ ఫైటర్‌ | - | Sakshi
Sakshi News home page

ఫైర్‌ ఫైటర్‌

Oct 4 2026 10:25 AM | Updated on Oct 4 2026 10:25 AM

ఫైర్‌ ఫైటర్‌ – 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

శ్రీసిటీలోని టీఐఎల్‌ హెల్త్‌కేర్‌లో పేలిన బాయిలర్‌

ఐదుగురు మృత్యువాత

కన్నీటిపర్యంతమైన బంధువులు, కుటుంబ సభ్యులు

పాకాల మండలం, ఓబులశెట్టిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి వినూత్న ఆవిష్క రణలకు శ్రీకారం చుడుతున్నాడు.

ఆదివారం శ్రీ 4 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

శ్రీసిటీలోని టాబ్లెట్‌ పరిశ్రమలో భారీ విస్పోటనం భయానక వాతావరణాన్ని సృష్టించింది. దాదాపు మూడు వందల మీటర్ల దూరంలో ఉన్న మరో ఫ్యాక్టరీ అద్దాలు ధ్వంసమయ్యాయంటే పేలుడు తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. పక్కనే ఉన్న ఇతర పరిశ్రమల రేకులు పేలుడు ధాటికి ధ్వంసమవ్వడం వళ్లు గగుర్పాటుకు గురిచేస్తోంది. ఐదుగురు మృత్యువాత పడగా.. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా చెల్లాచెదురుగా పడిపోవడం.. మాంసపు ముద్దలను తలపించడం చూపరులను భయాందోళనకు గురిచేసింది. శ్రీసిటీ పరిశ్రమలో శనివారం సంభవించిన భారీ విస్పోటనంపై ప్రత్యేక కథనం..

టాబ్లెట్‌ ఇండియా పరిశ్రమలో పేలుడు జరిగిన బాయిలర్‌ ప్రదేశం

ఎస్జీటీ సవరణ సీనియారిటీ జాబితా విడుదల

చిత్తూరు కలెక్టరేట్‌ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్‌ టీచర్ల (ఎస్జీటీ)ల సవరించిన జనరల్‌ సీనియారిటీ జాబితాను విడుదల చేసినట్లు డీఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. గతంలో స్వీకరించిన అభ్యంతరాలను సరిచేసి, ప్రభుత్వ, ఎంపీపీ, మున్సిపల్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేనేజ్‌మెంట్‌ల వారీగా జాబితాలను విడుదల చేసినట్లు వెల్లడించారు. ఆ జాబితాలను ఎంఈఓలు, డీవైఈఓల మెయిల్స్‌కు పంపడంతో పాటు డీఈఓ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు వివరించారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఉత్తర్వుల మేరకు, స్కూల్‌ అసిస్టెంట్‌, పీఎస్‌ హెచ్‌ఎంలుగా ఉద్యోగోన్నతి పొంది రివర్షన్‌ తీసుకున్న ఎస్జీటీలను వారి సర్వీస్‌లో చేరిన తేదీ ఆధారంగా ఈ సీనియారిటీ జాబితాలో చేర్చినట్లు తెలిపారు. ఈ జాబితాలో ఇంకేమైనా అభ్యంతరాలు ఉంటే తగిన ఆధారాలతో ఈ నెల 5వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు చిత్తూరు డీఈఓ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

కమ్యూనికేషన్‌ స్కిల్స్‌పై శిక్షణ

తిరుపతి సిటీ: రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి డిగ్రీ అండ్‌ పీజీ కళాశాలలో నాంది ఫౌండేషన్‌ సహకారంతో ఆరు రోజుల పాటు 650 మంది విద్యార్థినులకు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌పై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. శనివారం జరిగిన శిక్షణ ముగింపు కార్యక్రమానికి అతిథులుగా కర్నూల్‌ రీజియన్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అధికారి శ్రీనివాసులు, కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ భీమన్న ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. శిక్షణలో ప్రతిభ చూపిన విద్యార్థినులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఫ్యాకల్టీ సుహాసిని పాల్గొన్నారు.

2 కోట్లు దాటిన శ్రీవారి దర్శనాలు

తిరుమల: తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఈ ఏడాది 2 కోట్లు దాటింది. సెప్టెంబర్‌ నెలాఖరు వరకు మొత్తం 2 కోట్ల 9 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు అత్యధికంగా మేలో 25.46 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అత్యల్పంగా ఫిబ్రవరిలో 19.34 లక్షల మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. కేవలం తొమ్మిది నెలల్లోనే దర్శనాల సంఖ్య 2 కోట్లను దాటడం విశేషం.

శ్రీసిటీ (వరదయ్యపాళెం): శ్రీసిటీలోని టాబ్లెట్‌ ఇండియా(టీఐఎల్‌ హెల్త్‌కేర్‌)లో శనివారం ఉదయం భారీ విస్పోటనం సంభవించింది. ఐదుగురు మృత్యువాత పడ్డారు. ప్రమాద వార్త తెలియగానే పరిశ్రమ గేటు వద్దకు, శ్రీసిటీ ఆస్పత్రికి చేరుకుని బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.

ఆ నిర్లక్ష్యమే కొంపముంచిందా?

పరిశ్రమలో బాయిలర్‌ ప్రమాదం మరోసారి ప్రభుత్వ తనిఖీ వ్యవస్థ వైఫల్యాన్ని బట్టబయలు చేసింది. బాయిలర్ల భద్రతకు బాయిలర్‌ ఇన్‌న్‌స్పెక్టర్‌దే ప్రధాన బాధ్యత. బాయిలర్స్‌ యాక్ట్‌–1923 ప్రకారం ప్రతి బాయిలర్‌కు ఏటా హైడ్రాలిక్‌ టెస్ట్‌, స్టీమ్‌ టెస్ట్‌ నిర్వహించి ఫిట్‌నెస్‌ స ర్టిఫికెట్‌ ఇవ్వాలి. సేఫ్టీ వాల్వులు, ప్రెషర్‌ గేజ్‌లు, వాటర్‌ లెవెల్‌ ఇండికేటర్లు సరిగా పనిచేస్తున్నాయో లేదో క్షుణ్ణంగా పరిశీలించాలి. ఆపరేటర్లకు సర్టిఫికెట్‌ ఉందో లేదో చూడాలి. ఏటా కనీసం రెండు సార్లు ఆకస్మిక తనిఖీలు చేయాలి. కానీ తిరుపతి పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఇన్‌స్పెక్టర్‌ విస్మరించారనే ఆరోపణలున్నాయి. ఈ ఏడాది ఎప్రిల్‌లో ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్టర్‌ తనిఖీ చేపట్టి అంతా బాగున్నట్టు సర్టిఫై చేశారు. మరి ఆరు నెలలు గడవకముందే ఇంతపెద్ద ఘోర ప్రమాదం జరగడానికి ఎవరు నిర్లక్ష్యమో తెలియడం లేదు.

ఒక్కొక్కరిదీ ఒక్కో దీన గాథ

ఇంటికి వస్తానన్నావు కద నాయనా?

● సత్యవేడు మండలం, చెరివికి చెందిన చిన్నమస్తాన్‌ (36) మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ‘ఉదయం టిఫిన్‌ చేసి పనికి వెళ్లాడు.. ఇక రాడని తెలియదు’ అంటూ అతని భార్య గుండెలు పగిలేలా రోదించిన తీరు కలచివేసింది. తండ్రి మతదేహాన్ని చూసి పిల్లలు ‘నాన్నా’ అంటూ కన్నీళ్లు పెట్టుకోవడం చూపరుల గుండె తరుక్కుపోయేలా చేసింది.

● తమిళనాడులోని మాదరపాకంకు చెందిన రమేష్‌ (40) కుటుంబాన్ని పోషించుకుందామని వచ్చి శవంగా తేలాడు.

● పచ్చిమబెంగాల్‌కు చెందిన గౌరబ్‌రాయ్‌ (36), తడకు చెందిన వాసు (36) మృత్యువాత పడ్డారు. మహిళా కార్మికురాలు కృష్ణవేణి గాయాలతో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.

శ్రీసిటీలోని పరిశ్రమలో బాయిలర్‌ పేలి మృతి చెందిన ఐదుగురి కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.50 లక్షల చొప్పున పరిహారాన్ని రెండు రోజుల్లో అందజేస్తామని కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ ప్రకటించారు. 2 టన్నుల సామర్థ్యం గల బాయిలర్‌ ఆకస్మికంగా పేలిపోవడంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, ఎగసిపడిన శిథిలాలు తగలడంతో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారన్నారు. మృతుల్లో ఒక బాయిలర్‌ ఆపరేటర్‌, ఇద్దరు ఈటీపీ సిబ్బందితో పాటు మరో ఇద్దరు కార్మికులు ఉన్నారన్నారు. మరణించిన వారిలో ఒకరు కోల్‌కత్తా, ఇద్దరు తమిళనాడు, మరో ఇద్దరు స్థానికంగా చెరివి, తడ ప్రాంతాలకు చెందినవారన్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఎస్పీ ఎల్‌.సుబ్బారాయుడుతో కలసి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించామన్నారు. మృతుల పిల్లల ఉన్నత చదువులతో సహా అన్ని విద్యా ఖర్చులను శ్రీసిటీ యాజమాన్యమే భరిస్తుందన్నారు. అర్హులైన కుటుంబ సభ్యులకు శ్రీసిటీ లేదా పరిసర పరిశ్రమల్లో తక్షణమే ఉద్యోగావకాశం కల్పిస్తామన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన తిరుపతి బాయిలర్‌ ఇన్‌న్‌స్పెక్టర్‌ను తక్షణమే సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీచేశామన్నారు. ఆయన వెంట శ్రీసిటీ ఎండీ డాక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డి, సూళ్లూరుపేట ఆర్డీఓ దేవేందర్‌రెడ్డి, ఏఎస్పీలు రవిమనోహరాచారి, విమలకుమారి, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ విజయ్‌భరత్‌రెడ్డి ఉన్నారు.

పాచిపోయిన అన్నం ఎలా తింటారు?

నాయుడుపేట టౌన్‌: మండల పరిధిలోని పుదూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం మధ్యాహ్నం ఇస్కాన్‌ వారు పంపిన భోజనాన్ని విద్యార్థులు తిరస్కరించారు. భోజనం చెడిపోయి ఉండడాన్ని విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు సైతం గుర్తించారు. ఈ భోజనాన్ని ఎవరైనా తింటాటా..? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో సుమారు 200 మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. వీరికి రోజూ ఇస్కాన్‌ వారు ఎప్పుడో వండిన భోననాన్ని వాహనంలో తీసుకొచ్చి పెడుతున్నారు. అయితే వారు తీసుకొచ్చే భోజనంతో పాటు సాంబారు, రసం ఇతర కూరలు సైతం రుచీపచీలేకుండా ఉండడంతో విద్యార్థులు తినలేకఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై సంబంధిత యాజమాన్యానికి ఫిర్యాదు చేసేందుకు పలు పాఠశాలలు జంకుతున్నాయి. ఈ క్రమంలో శనివారం పుదూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు చెడిపోయిన భోజనాన్ని నిరాకరించారు. కొంతమంది మాత్రమే బెల్లం పొంగలి ఆరగించారు. భోజనం చిమిడిపోయి మొత్తబడిందని హెచ్‌ఎం శివప్రసాద్‌, మెస్‌ ఇన్‌చార్జి ఉపాధ్యా యురాలు వసంత కల్యాణి తెలిపారు. మండలంలో 59 ప్రభుత్వ పాఠశాలలకు ఇస్కాన్‌ వారు భోజనం, కూరలు వడ్డిస్తున్నారు.

కార్మిక బతుకుల్లో

విస్పోటనం

మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం

విషాదకరం

శ్రీ సిటీలోని టిల్‌ ఫార్మన్యూటికల్‌ పరిశ్రమలో జరిగిన ప్రమాద ఘటనలో ఐదుగురు మృతి చెందడం విషాదకరం. పరిశ్రమ యాజమాన్యం, బాయిలర్‌ ఇన్‌స్పెక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే ఇంతటి ఘోరం జరిగింది. బాయిలర్‌ పేలుడుతో 300 మీటర్ల మేర ప్రమాద తీవ్రత ఏర్పడిందంటే ఎంతపెద్ద పేలుడు జరిగిందో అర్థమవుతుంది. మృతుల కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలి.

– భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు

నిరాకరించడం నిజమే

పుదూరు ఉన్నత పాఠశాలలో శనివారం భోజనం చిమిడిపోయి నీళ్లు మాదిరిగా ఉందని గుర్తించినట్లు ఫిర్యాదు వచ్చింది. భోజనాన్ని తిరిగి పంపించినట్లు ఉపాధ్యాయులు వివరించారు. ఈ విషయమై జిల్లా విద్యశాఖ అధికారికి కూడా ఫిర్యాదు చేశాం. ప్రభుత్వ పాఠశాలలకు ప్రతి రోజూ నాణ్యమైన భోజనం సరఫరా చేయాలి.

– మునిరత్నం, ఎంఈఓ, నాయుడుపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement