కనుసైగలతో గణిత విన్యాసం | - | Sakshi
Sakshi News home page

కనుసైగలతో గణిత విన్యాసం

Oct 4 2026 10:25 AM | Updated on Oct 4 2026 10:25 AM

● అబ్బురపరుస్తున్న తుమ్మింద విద్యార్థులు ● కనుబొమ్మల కదలికలతో క్షణాల్లో సమాధానాలు ● దేశంలోనే తొలిసారిగా కొత్త ప్రక్రియకు శ్రీకారం ● ఇటీవల శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో వందమందికి పైగా గణిత ఉపాధ్యాయుల సమక్షంలో ఈ ప్రదర్శన ఇవ్వగా, ఉపాధ్యాయులంతా విద్యార్థుల ప్రతిభకు నిలబడి అభినందనలు కురిపించారు. ● పూర్వ డీఈఓ రాజేంద్రప్రసాద్‌ విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు. విద్యార్థుల్లో మేధోశక్తిని, ఏకాగ్రతను పెంపొందించడానికి ఎంతో దోహదపడుతుందని కొనియాడారు. ● ఇటీవల తుమ్మింద జెడ్పీ హైస్కూల్‌ను సందర్శించిన ప్రస్తుత డీఈఓ లక్ష్మీనారాయణ సైతం విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు. ఈ నెలలో వీరి ప్రదర్శనను ప్రత్యేకంగా పెద్ద స్థాయిలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ● సెప్టెంబర్‌ 11న కన్నన్‌ జయంతి సందర్భంగా కన్నన్‌ పాఠశాలలో నిర్వహించిన ఈ విద్యార్థులు ప్రదర్శించిన నేత్ర గణిత అవధానానికి జూనియర్‌ కళాశాల, ఉన్నత పాఠశాల విద్యార్థులు మంత్రముగ్ధులయ్యారు. ● మాటలు లేకుండా కేవలం కనుసైగలతో సంక్లిష్ట సమాచారాన్ని బదిలీ చేసే ఈ నేత్రావధాన ప్రక్రియ దేశ సరిహద్దుల్లో పనిచేసే సైనికులకు ఎంతో ఉపయోగపడుతుందని పలువురు సూచిస్తున్నారు. ● ఈ అద్భుత ప్రక్రియ వెనుక తుమ్మింద పాఠశాల గణిత ఉపాధ్యాయుడు అరుణ శివప్రసాద్‌ కృషి ఎంతో ఉంది. స్వతహాగా గణిత అవధాని అయిన ఆయన ఇప్పటివరకు 56 అవధానాలు నిర్వహించారు. సుమారు 48 మంది విద్యార్థులతో గణిత అవధానాలు చేయించిన ఘనత ఆయనది.

● అబ్బురపరుస్తున్న తుమ్మింద విద్యార్థులు ● కనుబొమ్మల కదలికలతో క్షణాల్లో సమాధానాలు ● దేశంలోనే తొలిసారిగా కొత్త ప్రక్రియకు శ్రీకారం

చిత్తూరు కలెక్టరేట్‌ : చిత్తూరు రూరల్‌ మండలం తుమ్మింద జెడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న చాముండి, 9వ తరగతి విద్యార్థులు జ్ఞానప్రియ, శర్వాన్‌ తమ వినూత్న విద్యలో ప్రతిభ చూపుతున్నారు. ప్రేక్షకులు, పరిశీలకులు పేపర్‌పై రాసి ఇచ్చే పదాలు, వాక్యాలు, సంఖ్యలను మొదట జ్ఞానప్రియ గమనిస్తుంది. ఆ తర్వాత ఆమె ఎలాంటి మాటలు లేకుండా కేవలం తన కనుబొమ్మల కదలికల సైగలతో ఆ సమాచారాన్ని శర్వాన్‌, చాముండికి చేరవేస్తుంది. ఆ సైగలను క్షణాల్లో అర్థం చేసుకునే శర్వాన్‌, చాముండిలు పేపర్‌పై రాసిన విషయాన్ని ఏమాత్రం పొరపాటు లేకుండా స్పష్టంగా చెప్పేస్తుండడం విశేషం.

దేశంలోనే ప్రథమం

గతంలో గణిత అవధానం చేసిన చాముండి, శర్వాన్‌, జ్ఞానప్రియ ఇప్పుడు నేత్రావధానాన్ని, గణితావధానాన్ని మిళితం చేసి దేశంలోనే మొట్టమొదటిసారిగా నేత్రగణిత అవధానం ప్రదర్శిస్తున్నారు. ఈ అవధానంలో వర్గాలు, ఎక్కాలు, వర్గ మూలాలు, ఘన మూలాలు, వింత చదరాలు, గణాలు, వార గణనతో పాటు 10 అంకెల సంఖ్యను ధారణతో ఎటువైపు నుంచి అడిగినా టక్కున చెప్పేస్తూ మేధోశక్తిని చాటుకుంటున్నారు.

ప్రశంసలు.. విశేష ఆదరణ

మేధోశక్తిని వెలికితీసేందుకే..

‘సాధారణంగా విద్యార్థుల్లో గణితం అంటే ఉన్న భయాన్ని పోగొట్టి, వారిలో సృజనాత్మకతను, ఏకాగ్రతను పెంపొందించడమే నా ఉద్దేశం. స్వతహాగా నేను గణిత అవధానిగా ఇప్పటివరకు 56 అవధానాలు నిర్వహించా. ఆ అనుభవంతోనే నేత్రావధానంలో ఉన్న సూక్ష్మ పద్ధతులను అధ్యయనం చేసి, విద్యార్థులకు కనుబొమ్మల సైగలతో అక్షరాలను, సంఖ్యలను గుర్తించే మెళకువలను నేర్పించా. దీన్ని గణితావధానంతో మిళితం చేసి దేశంలోనే తొలిసారిగా నేత్రగణిత అవధానంగా రూపొందించా. చాముండి, జ్ఞానప్రియ, శర్వాన్‌ అత్యంత ప్రతిభావంతులు.

–హెచ్‌.అరుణ శివప్రసాద్‌, గణిత ఉపాధ్యాయుడు, జెడ్పీ హైస్కూల్‌, తుమ్మింద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement