మాది మధ్యతరగతి కుటుంబం. నాన్న విజయ్ కుమార్ చిన్న వ్యాపారం చేస్తుంటారు, అమ్మ కల్పన. నేత్రగణిత అవధానం నా జీవితాన్ని పెద్ద మలుపు తిప్పింది. దీంతో ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవడమే కాకుండా గణితంపై ఆసక్తి పెరిగింది. గత సంవత్సరం నిర్వహించిన జాతీయ ఉపకార వేతన పరీక్షలో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. భవిష్యత్తులో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కావాలన్నదే నా ఆశయం. – శర్వాన్, 9వ తరగతి విద్యార్థి
నర్సింగ్ చదివి సేవ చేస్తా
మాది చాలా పేద కుటుంబం. నాన్న ఎం.మణికంఠ ఆటో డ్రైవర్‌గా, అమ్మ సి.విజయలక్ష్మి పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికురాలిగా పనిచేస్తున్నారు. మొదట్లో నేత్రగణిత అవధానం నేర్చుకోవడానికి, వేదికపై ప్రదర్శించడానికి చాలా భయపడేదాన్ని. నూతన ప్రదర్శనలకు మా నాన్న వద్దని కూడా చెప్పారు. కానీ, పట్టుదలతో కుటుంబ సభ్యులను ఒప్పించి మా గురువుగారి వద్ద శిక్షణ పొందా. ఇప్పుడు ఎలాంటి భయం, స్టేజ్ ఫియర్ లేకుండా కొత్త ప్రదేశాల్లో సైతం సులభంగా కనుబొమ్మల సైగలతో కోడింగ్ చేస్తూ అవధానం చేస్తున్నా. ప్రేక్షకుల అభినందనలు, తల్లిదండ్రుల సంతోషం నాకు ఎంతో స్ఫూర్తినిస్తున్నాయి. భవిష్యత్తులో నర్సింగ్ చదివి సేవ చేయాలన్నదే నా కోరిక.
– ఎం.జ్ఞానప్రియ, 9వ తరగతి విద్యార్థిని
ఆత్మవిశ్వాసం నింపింది
మా నాన్న చిట్టిబాబు మేస్త్రి పని చేస్తుంటారు, గత సంవత్సరం మా ఉపాధ్యాయుడు అరుణ శివప్రసాద్ సార్ వద్ద గణిత అవధానం నేర్చుకున్నా. కనుబొమ్మల కదలికలతో సమాచారాన్ని గ్రహించి చెప్పే ఈ నేత్రగణిత అవధానం నాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. – పి.చాముండి, 8వ తరగతి


