తిరుమల రెండో ఘాట్‌లో ప్రమాదం
తిరుమల : తిరుపతి నుంచి తిరుమల వెళ్లే రెండో ఘాట్ రోడ్‌లో ఆదివారం ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. తమిళనాడుకు చెందిన భక్తులు కారులో అలిపిరి తనిఖీ కేంద్రం దాటిన తర్వాత మితిమీరిన వేగంతో వెళుతూ పిట్ట గోడను ఢీకొన్నారు. ప్రమాదంలో కారు బోల్తా కొట్టింది. విషయం తెలుసుకున్న టీటీడీ విజిలె న్స్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
అకడమిక్ కన్సల్టెంట్ల అవస్థలు
– వేతనాల కోసం పడిగాపులు
తిరుపతి సిటీ : ఎస్వీయూలో పనిచేస్తున్న అకడమిక్ కన్సల్టెంట్ల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఈనెల 17వ తేదీ గడుస్తున్నా ఇప్పటి వరకు వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారు. వర్సిటీ అధికారులను వేడుకున్నా ఈనెల వేతనం వచ్చేనెలలో చెల్లిస్తామని సమాధానం చెప్పినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల ఈఎంఐలు. బ్యాంకు రుణాలు, వడ్టీలు, కుటుంబ అవసరాల కోసం ఇంట్లో నగలు తాకట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్నామని వాపోతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క నెల కూడా ఒకటో తేదీన వేతనం అందలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


