కార్మికుల ఆందోళన
చంద్రబాబు పాలనలో కష్టాలు తప్పడం లేదంటూ భారత కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. ప్రధానంగా జీఓ నంబర్ 23 తీసుకువచ్చి 8గంటల పనిని 12 గంటలకు పెంచారని మండిపడ్డారు. అలాగే 67 షెడ్యూల్ రంగాల కార్మికులకు కనీస వేతనాలు పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశ,అంగన్‌వాడీ వర్కర్లుకు గౌరవ వేతనం పెంచుతామని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 18 నెలలు గడుస్తున్న పట్టించుకోవడం లేదని విమర్శించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. – ధర్నా చేస్తున్న కార్మిక సంఘాలు


