శ్రీసిటీ పరిశ్రమల సామాజిక బాధ్యత
శ్రీసిటీ(సత్యవేడు): శ్రీసిటీలోని ఎన్‌ఎస్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, చార్ట్–వీఆర్‌వీ పరిశ్రమలు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద రూ.58 లక్షలు వెచ్చించాయి. సోమవారం ఈ మేరకు సత్యవేడులో రూ. 46 లక్షల వ్యయంతో బీసీ బాలుర కళాశాల హాస్టల్ భవనాన్ని ఎన్‌ఎస్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఇండియా పరిశ్రమ ఎండీ హాజీయే కజోకా, శ్రీసిటీ డైరెక్టర్ (సీఎస్‌ఆర్) నిరీషా సన్నారెడ్డి ప్రారంభించారు. నూతన భవనంతో విద్యార్థులకు మెరుగైన వసతి కలిగిందని శ్రీకాళహస్తి డివిజన్ అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారి మునీంద్రయ్య తెలిపారు. అలాగే చార్ట్– వీఆర్‌వీ పరిశ్రమ రూ.12 లక్షలు వెచ్చించి వానెల్లూరులో నిర్మించి నూతన అంగన్‌వాడీ భవనం, వంటగదిని సంస్థ డైరెక్టర్ (హెచ్‌ఆర్) యామినీ సిన్హా, తయారీ విభాగం హెడ్ ప్రసంజిత్ ప్రారంభించారు. సీడీపీఓ దేవకుమారి సదరు పరిశ్రమ యాజమాన్యంకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్‌ఎస్ ఇన్‌స్ట్రుమెంట్స్ డీజీఎం వెంకటేష్, సీఎస్‌ఆర్ కమిటీ సభ్యులు మల్లీశ్వరన్, పృథ్వీ, మహేష్, ప్రసాద్, హాస్టల్ వార్డెన్లు గంగాప్రసాద్, ఎస్. రామయ్య, అంగన్‌వాడీ కార్యకర్త నాగమ్మ పాల్గొన్నారు.
శ్రీసిటీ పరిశ్రమల సామాజిక బాధ్యత


