భవిష్యత్ రక్షణపై అవగాహన
తిరుపతి సిటీ: తిరుపతి జీవకోనలోని విశ్వం హైస్కూల్‌లో మహిళా పోలీస్టేషన్ ఎస్‌ఐ కుళ్లాయప్ప ఆధ్వర్యంలో విద్యార్థుల భద్రత – భవిష్యత్ రక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్‌ఐ మాట్లాడుతూ వ్యక్తిత్వ వికాసం, సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న మోసపూరిత చర్యలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ప్రమాదాలు, జాగ్రత్తలు, టీనేజ్ వయసులో ఎదురయ్యే ఆకర్షణలు, వాటిని నియంత్రించనప్పుడు వచ్చే ప్రతికూల పరిణామాలను వివరించారు. విశ్వం విద్యాసంస్థల అధినేత డాక్టర్ విశ్వనాథ్‌రెడ్డి పాల్గొన్నారు.
సమాజ శ్రేయస్సుకు సమష్టి కృషి
తిరుపతి రూరల్:సమాజ శ్రేయస్సు కోసం సమష్టి గా కృషి చేయాలని జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్, ప్రధాన శాస్త్రవేత్త రామకృష్ణారావు సూచించారు. సోమవారం తిరుపతి రూరల్ మండలం అడపారెడ్డిపల్లెలో ఎస్వీ వ్యవసాయ కళాశాల విద్యార్థులు నిర్వహించిన ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థినీ, విద్యార్థులతో పాటు గ్రామస్తులు సైతం సామాజిక బాధ్యత, సేవా గుణంతో ముందడుగు వేయా లని కోరారు. ఏఓ సుబ్బారావు, ఎన్‌ఎస్‌ఎస్ అధికారి సబితా మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలని కోరారు. వ్యవసాయ శాఖ ఏడీ నాగమణి పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో కార్తీక పూజలు
తిరుపతి అర్బన్ : కార్తీక సోమవారం నేపథ్యంలో శ్రీకాళహస్తీశ్వరాలయం, గుడిమల్లంలోని పరశురామేశ్వరాలయం, తిరుపతిలోని కపిలతీర్థం, తలకోనలోని సిద్ధేశ్వరాలయం, నారాయణవనం, నాగలాపురం, సురుటుపల్లిలోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. మహిళలు దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.
సిద్ధలయ్య కోనకు
పోటెత్తిన భక్తులు
సైదాపురం : సైదాపురం సమీపంలో సిద్ధలయ్యకోనకు కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. గంటల తరబడి క్యూలో వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు. మహిళలు దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఒగ్గు కృష్ణయ్య అధ్వర్యంలో 5వేల మంది భక్తులకు అన్నదానం చేశారు.
భవిష్యత్ రక్షణపై అవగాహన
భవిష్యత్ రక్షణపై అవగాహన
భవిష్యత్ రక్షణపై అవగాహన


