పూరిల్లు దగ్ధం
నాయుడుపేటటౌన్ : పట్టణంలోని లోతువానిగుంట కాలనీలో ఆదివారం ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో పూరిల్లు దగ్ధమైంది. వివరాలు.. యానాది సుబ్బమ్మ అమె భర్త పులయ్య బయటకు వెళ్లిన సమయంలో ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే పూరిల్లు పూర్తిగా కాలిపోయింది. ఈ క్రమంలో ఇంటి నిర్మాణం కోసం దాచి ఉందని రూ.2లక్షల నగదు, బంగారు, వెండి వస్తువులు, ఇతర సామగ్రి అగ్నికి ఆహుతైనట్లు బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. నిరుపేదలైన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
పేకాట స్థావరంపై దాడి
కోట: మండలంలోని ఊనుగుంటపాళెం అటవీ ప్రాంతంలో పేకాట స్థావరంపై ఆదివారం పోలీసులు దాడి చేశారు. 9 మంది జూదరులతో పాటు రూ.65 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ పవన్‌కుమార్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
వేర్వేరుచోట్ల
ఎర్రచందనం పట్టివేత
– నలుగురి అరెస్ట్
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : జిల్లాలోని శ్రీకాళహస్తి మండలం పరిధిలో వేర్వేరు చోట్ల 24 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, నలుగురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. ఆర్‌ఎస్‌ఐ విష్ణువర్డన్ కుమార్ బృందం ఆదవరం బీటు పరిధిలో కూంబింగ్ చేపట్టగా సదాశివకోన వద్ద 15 ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. ముగ్గురు ఎర్రదొంగలను అదుపులోకి తీసుకున్నారు. అలాగే తీర్ధాలపాలకోన వద్ద ఏఆర్‌ఎస్‌ఐ కె.మహేశ్వరనాయుడు టీమ్ చేపట్టిన కూంబింగ్‌లో 9 ఎర్రచందనం దుంగలతో సహా ఒక స్మగ్లర్ పట్టుబడ్డాడు. నిందితులు తమిళనాడులోని కల్లకురుచ్చి జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. వీరిని తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్‌కు తరలించారు. సీఐ ఖాదర్ భాషా, ఎస్‌ఐ రఫీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పూరిల్లు దగ్ధం
పూరిల్లు దగ్ధం


