● రోడ్లు ఛిద్రం.. ప్రయాణం నరకం
ఊరూ వాడా రోడ్లన్నీ గుంతలమయమయ్యాయి. వర్షమొస్తే ఎక్కడ గుంత ఉందో.. ఎక్కడ బాగుందో తెలియని పరిస్థితి నెలకొంది. వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్ల పనులు మొదలు పెడతాం.. అద్దాల్లాంటి రోడ్లు నిర్మిస్తాం. మీ ఊర్లకొచ్చే బంధువులు వాటిని చూసి ఆశ్చర్యపోయేలా చేస్తాం..’ అంటూ ఊదరగొట్టిన సీఎం చంద్రబాబు ఆచరణలో చతికిల పడ్డారు. ఎక్కడ రోడ్లు అక్కడే వదిలేశారు. గుంతల్లో ప్రయాణించలేక వాహనచోదకులు, పాదచారులు నానా ఇక్కట్ల పాలవుతున్నారు. అందుకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని రేణిగుంట సర్కిల్ మీదుగా కడపకు వెళ్లే ప్రధాన మార్గమే నిదర్శనం. మరోవైపు కరకంబాడి నుంచి తిరుపతికి వెళ్లే రహదారి కూడా ఇలాగే కనిపించింది. పాలకులు ఎలాగూ రోడ్ల గురించి ఆలోచించడం లేదు.. కనీసం అధికారులైన స్పందించి మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. లేకుంటే ప్రమాదాల బారిన పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, తిరుపతి
● రోడ్లు ఛిద్రం.. ప్రయాణం నరకం
● రోడ్లు ఛిద్రం.. ప్రయాణం నరకం
● రోడ్లు ఛిద్రం.. ప్రయాణం నరకం
● రోడ్లు ఛిద్రం.. ప్రయాణం నరకం
● రోడ్లు ఛిద్రం.. ప్రయాణం నరకం


