
యుద్ధం గెలిచిన వీరుడు మిథున్
చంద్రబాబుపైశాచిక ఆనందం కోసమే 71 రోజుల జైలు ఎంపీ మిథున్‌రెడ్డిని కలిసిన భూమనకరుణాకరరెడ్డి
తిరుపతి మంగళం: సంగ్రామంలో నుంచి బయటకు వచ్చిన యుద్ధవీరుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి అన్నారు. బెయిల్‌పై వచ్చిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని గురువారం తిరుపతి మారుతీనగర్‌లోని ఆయన నివాసంలో భూమన కరుణాకరరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలు పార్టీ కేడర్‌కి ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన తెలిపారు. వైఎస్‌ఆర్ సీపీ అభ్యున్నతికి, జగనన్నను తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి పడిన కష్టంపై ఎంపీ మిథున్‌రెడ్డిని అభినందించారు. లిక్కర్‌స్కామ్ అంటూ ఎంపీ మిథున్‌రెడ్డిని, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితోపాటు మరి కొందరిపై అక్రమ కేసులు బనాయించి, జైళ్లకు పంపారన్నారు. చంద్రబాబు పైశాచిక ఆనందం కోసం ఎంపీ మిథున్‌రెడ్డిని 71రోజుల పాటు ఓ టెర్రరిస్టులా జైల్లో నిర్బంధించారన్నారు. జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబంపై కక్ష సాధింపుల్లో భాగంగానే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారన్నారు. చంద్రబాబు పెట్టే అక్రమ కేసులకు బయపడే వారెవ్వరూ వైఎస్‌ఆర్ సీపీలో లేరని స్పష్టం చేశారు.