
దళితులకు అండగా వైఎస్సార్‌సీపీ
దేవళంపేటలో అంబేడ్కర్ విగ్రహానికి నిప్పుపెట్టడం దారుణం
దళితుల ఆత్మగౌరవాన్ని కాల్చి వేస్తున్నారు
నేడు విగ్రహానికి నిప్పు.. రేపు మమ్మల్ని ఏం చేస్తారో?
ఆందోళనకు దిగిన దళిత సంఘాలు
నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
వెదురుకుప్పం: మండలంలోని దేవళంపేటలో స్థానిక సర్పంచ్ గోవిందయ్య 2023లో అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దేవళంపేట–తిరుపతి ప్రధాన రహదారి పక్కన ఉన్న స్థలంలో విగ్రహాన్ని నెలకొల్పారు. ఆ స్థలాన్ని స్థానికంగా కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. వారి ప్రయత్నాలను అడ్డుకుంటూ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అప్ప ట్లోనే పరోక్షంగా సర్పంచ్ గోవిందయ్యపై కొందరు టీడీపీ నేతలు భగ్గుమన్నారు. 2024 ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్ వద్దకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మిని టీడీపీ నేత సతీష్ నాయుడు కులం పేరుతో దూషించారు. అధికారం రావడంతో సర్పంచ్‌పై జిల్లా అధికారులకు ఫిర్యా దు చేసి చెక్ పవర్‌ను రద్దు చేయించారు. అంతటితో ఆగకుండా సర్పంచ్‌పై పలు కేసులు పెట్టించి వేధించారు. వాటన్నిటికీ వెరవకుండా వైఎస్సార్‌సీపీలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో టీడీపీకి చెందిన సతీష్ నాయుడు, అతని అనుచరులు కలిసి అంబేడ్కర్ విగ్రహాన్ని తగలబెట్టేందుకు పూనుకున్నారు.
ఉలిక్కపడ్డ దళితులు
గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అంబేడ్కర్ విగ్రహంపై పెట్రోలు పోసి తగలబెట్టారు. దీంతో ఒక్కసారిగా దళితులు ఉలిక్కిపడ్డారు. పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఏకమై దుశ్చర్యను ఖండించాయి. ఈ రోజు విగ్రహానికి నిప్పు పెట్టారు.. రేపు మమ్మల్ని ఏం చేస్తారోనని రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు.
కాళ్లు పట్టుకుంటాం.. న్యాయం చేయండి
మీ కాళ్లు పట్టుకుంటాం.. ఇక మమ్మల్ని బతకనివ్వరు.. మాకు న్యాయం చేయండంటూ సర్పంచ్ గోవిందయ్య ఏకంగా నగరి డీఎస్పీ మహ్మద్‌అజీజ్ కాళ్లు పట్టుకున్నారు. ఇదిలా ఉండగా చిత్తూరు ఎస్పీ తుషార్‌డూడిని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, నియోజకవర్గ ఇన్‌చార్జి కృపాలక్ష్మి వెదురుకుప్పం పోలీసు స్టేషన్‌లో కలిసి.. పోలీసుల వైఫల్యం, వారి తీరును ఎండగట్టారు. వారి నిర్లక్ష్యంతోనే నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు జరుగుతన్నట్లు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. బందార్లపల్లె ఘటనను గుర్తుచేశారు. బొమ్మయ్యపల్లె ఎంపీటీసీ భాస్కర్‌కు జరిగిన అవమానాన్ని గుర్తుచేసి న్యాయం చేయాలని కోరారు. ఈనెల 25లోపు నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని సూచించారు.
దేవళంపేటలో జరిగిన ఘటనతో బడుగు బలహీనవర్గాలకు అండగా వైఎస్సార్‌సీపీ నిలిచింది. మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, గంగాధరనెల్లూరు నియోజకవర్గ ఇన్‌చార్జి కృపాలక్ష్మితో పాటు కార్వేటినగరం, పెనుమూరు, శ్రీరంగరాజపురం మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు శుక్రవారం పెద్దు ఎత్తున ఘటనా స్థలానికి చేరుకుని నిందితుల చర్యలను తీవ్రంగా ఖండించారు. ఎంతటి వారినైనా శిక్షించాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. న్యాయం జరగకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసేందుకు వెనుకాడబోమని హెచ్చరించాయి.

దళితులకు అండగా వైఎస్సార్‌సీపీ