
కలెక్టర్ ఆరా..
దేవళంపేట ఘటనపై జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ ఆరా తీశారు. విషయం తెలిసిన వెంటనే ఘట నా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సీసీ ఫుటేజీలు, పోన్ సంభాషణలు, అర్ధరాత్రి ఎవరు తిరిగారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు థామస్, మురళీ మోహన్ కూడా స్పందించారు. విగ్రహానికి నిప్పు పెట్టిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు. కాలిపోయిన విగ్రహం స్థానంలో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.