
ఆది నుంచీ అరాచకమే
కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచీ వారు చేస్తున్న అరాచకాలకు హద్దుల్లేవు. ఇది అన్యా యం అని ప్రశ్ని స్తే అడిగిన వాళ్లపైనే కేసులు నమోదు చేస్తున్నారు. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోంది. అంబేడ్కర్ విగ్రహాలను కూల్చి వేయడం, చెప్పుల మాలలు వేసి అవమానించడం, నిప్పు పెట్టడం వంటి ఘటనలు నిత్యం జరుగుతూనే లున్నాయి. మహిళలు, వృద్ధులు, బాలికలు ఇలా అందరూ కూటమి పాలనలో దాడులకు గురవుతున్నారు. అంబేడ్కర్ ఎస్సీ, ఎస్టీలకే కాదు అందరికీ దారి చూపించాడు. ప్రతిక్కరికీ దైవ స్వరూపమైన అంబేడ్కర్‌కి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు. ఇలాంటి దారుణాలు చేసిన వారిని కఠి నంగా శిక్షించాలి. అలా జరగని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం.
– కే.కృపాలక్ష్మి, నియోజకవర్గ ఇన్‌చార్జి