
లీజు ఒకచోట.. తవ్వింది మరోచోట
శ్రీకాళహస్తి : లీజుకిచ్చిన క్వారీ భూమిలో కాకుండా ఏపీఐఐసీ భూమిలో తవ్వకాలు చేపట్టి మెటల్ కొల్లగొట్టిన క్వారీ యజమానిపై అధికారులు శుక్రవారం కేసు నమోదు చేశారు. తొట్టంబేడు మండలంలోని తాటిపర్తి రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 129లో మహేశ్వర నాయుడు అనే వ్యక్తికి మహేశ్వర స్టోన్ క్రషర్స్ పేరిట క్వారీ తవ్వకాలకు ప్రభుత్వం లీజు మంజూరు చేసింది. అయితే లీజు భూమిలో కాకుండా పక్కనే ఉన్న ఏపీఐఐసీ (సర్వే నంబర్ 212) భూముల్లో తవ్వకాలు చేపట్టాడు. సుమారు 1.10 లక్షల క్యూబిక్ మీటర్ల రోడ్ మెటల్, బిల్డింగ్ స్టోన్‌ను పది మీటర్ల లోతుకు తవ్వి తరలించి సొమ్ము చేసుకున్నాడు. ఈ విషయంపై ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ (తిరుపతి) ఫిర్యాదు చేయగా ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, క్వారీని తనిఖీ చేసి యజమాని మహేశ్వర నాయుడుపై కేసు నమోదు చేశారు.