
కమనీయం.. కల్యాణం
వడమాలపేట (పుత్తూరు): అప్పలాయగుంటలో వెలసిన శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం శుక్రవారం కమనీయంగా సాగింది. శ్రీవారి జన్మ నక్షత్రం అయిన శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకొని వేదపండితులు శాస్త్రోక్తంగా కల్యాణం జరిపించారు. వేకువ జాము స్వామి వారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి నిత్య కై ంకర్యాలు నిర్వహించారు. అనంతరం పద్మావతీ, ఆండాల్ సమేత ప్రసన్న వేంకటేశ్వరుడ్ని పట్టు పీతాంబరాలు, విశేష స్వర్ణాభరణాలు, సుగంధ పరిమళ భరిత పుష్పమాలికలతో సుందరంగా అలంకరించి నూతన వధూవరులుగా తీర్చిదిద్దారు. ఆలయ పండిత బృందం ముందుగా గణపతి హోమం నిర్వహించింది. అనంతరం మంగళవాయిద్యాలు, వేదమంత్రాలు, భక్తుల గోవిందనామ స్మరణల మధ్య మాంగల్యధారణను కమనీయంగా నిర్వహించారు. కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

కమనీయం.. కల్యాణం