
9 నుంచి సప్త మోక్ష క్షేత్ర యాత్ర రైలు సేవలు
తిరుపతి కల్చరల్ : సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ 9న రైలు ద్వారా దేశంలోని పలు పుణ్య క్షేత్రాల సందర్శనకు మంచి ప్యాకేజీని సద్వినియోగం చేసుకోవాలని టూర్ టైమ్స్ డైరెక్టర్ విగ్నేష్ పిలుపు నిచ్చారు. శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సప్తమోక్ష క్షేత్ర యాత్ర రైలు ప్యాకేజీ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 14 రోజుల పాటు దేశవ్యాప్తంగా ఏడు నదులు, నాలుగు జ్యోతిర్లింగాల ప్రాంతాలను ఈ ప్యాకేజీ ద్వారా చూపించి తిరిగి వారి స్వస్థలాలకు తీసుకురావడం జరుగుతుందన్నారు. 650 మంది ప్యాసింజర్లను ఈ యాత్ర రైలు ద్వారా తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. మూడు విభాగాలుగా ఈ ప్రత్యేక రైలులో ప్యాకేజీ టికెట్ ధరను నిర్ణయించామని తెలిపారు. థర్డ్ ఏసీ(కంఫర్ట్) రూ.45,750, సెకండ్ ఏసీ(డీలక్స్) రూ.54,100, ఫస్ట్ ఏసీ(లగ్జరీ) రూ.69,500గా ఉన్నాయన్నారు.