
ఫెర్టిలిటీ సెంటర్లలో వరుస తనిఖీలు
తిరుపతి తుడా: తిరుపతి నగరంలోని ఫెర్టిలిటీ సెంటర్లలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వరుస తనిఖీలను నిర్వహిస్తున్నారు. ఫెర్టిలిటీ సెంటర్లలో సంతానోత్పత్తి పేరుతో జరిగే మోసాలు, వైద్యంపై ఫిర్యాదులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగా శుక్రవారం స్థానిక మాతృత్వ ఫెర్టిలిటీ సెంటర్, అంకుర ఎస్ ఫెర్టిలిటీ సెంటర్లను తనిఖీచేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శాంతకుమారి ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలను చేపట్టారు. నిబంధనల ప్రకారం ఆస్పత్రులను నడపాలని, నిబంధనలు అతిక్రమిస్తే శాఖాపరమైన చర్యలు ఉంటాయని నిర్వాహకులను ఆమె హెచ్చరించారు. ఈ తనిఖీల్లో డాక్టర్ త్రివేణి, సిబ్బంది కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.