
నూతన ఎస్‌ఐలకు దిశా నిర్దేశం
తిరుపతి క్రైమ్: విధి నిర్వహణలో నిజాయితీగా వుండాలని, బాధితులకు న్యాయం చేయడంలో అలసత్వం వహించరాదని ఎస్పీ హర్షన్‌వర్ధన్‌రాజు ప్రొబేషనర్ ఎస్‌ఐలకు సూచించారు. పోలీసు గెస్ట్ హౌస్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం తిరుపతి జిల్లాకు 36 మంది ప్రొబేషనరీ ఎస్‌ఐలను కేటాయించిందని తెలిపారు. వారిలో కర్నూలు రేంజ్ నుంచి 32 మంది, గుంటూరు నుంచి నలుగురు ఉన్నాయని పేర్కొన్నారు. వారిలో 21 మంది ఎస్‌ఐలు, 15 మంది ఉమెన్ ఎస్‌ఐలు ఉన్నారని వివరించారు. విధి నిర్వహణలో సవాళ్లను అధిగమించి ముందుకు వెళ్లాలని, ప్రజలకు న్యాయం చేయాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్‌లోనూ ప్రతిభ చాటాలని తెలిపారు. పోలీసు శాఖలో హోంగార్డు నుంచి ఉన్నత స్థాయి అధికారి వరకు అందరూ ఒకటేనని, ప్రతి ఒక్కరినీ గౌరవించాలన్నారు. ఉన్నతాధికారులతో మర్యాదపూర్వకంగా నడుచుకుంటూ, కింద స్థాయి సిబ్బందిని కలుపుకుంటూ పనిచేయాలన్నారు.
ముగిసిన క్యాన్సర్ గ్రిడ్ వార్షిక సమావేశం
తిరుపతి తుడా: స్థానిక జూపార్క్ రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ ఇన్‌న్‌స్టిట్యూట్(స్వీకార్)లో రెండు రోజుల పాటు కొనసాగిన జాతీయ క్యాన్సర్ గ్రిడ్ ఏపీ స్టేట్ చాప్టర్ 3వ వార్షిక సమావేశం ఆదివారం ముగిసింది. రెండు రోజుల పాటు నిర్వహించిన వార్షిక సమావేశానికి ఆన్‌లైన్ ద్వారా ఏపీ ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, రాష్ట వ్యాప్తంగా కాన్సర్ వైద్య నిపుణులు పాల్గొన్నారు. క్యాన్సర్ గుర్తింపు, నివారణ, నాణ్యమైన చికిత్స, పరిశోధనలను ప్రోత్సహించడం, వైద్యులకు అధునాతన చికిత్సలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వడమే ఈ సమావేశాల ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టాటా మెమోరియల్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ సీఎస్ ప్రమేష్, డాక్టర్ కై లాష్ శర్మ, డాక్టర్ ఉమేష్ మహంత్‌శెట్టి, దినేశ్ కుమార్‌లు, వైద్యనిపుణలు, డాక్టర్లు పాల్గొన్నారు.
బాలసదనంలో
ఉద్యోగాలకు దరఖాస్తులు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి పట్టణంలోని బాలసదనంలో అవుట్‌సోర్సింగ్, పార్ట్‌టైం ప్రతిపాదికన ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు బాలసదనం సూపరింటెండెంట్ తెలిపారు. కుక్–2 పోస్టులు, హెల్పర్, హెల్పర్ కం నైట్‌వాచ్‌మెన్–2, హౌస్ కీపర్–1 ఆర్ట్ అండ్ క్రాప్ట్‌కు మ్యూజిక్ టీచర్–1, పీటీ ఇన్‌స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన వారు సంబందిత వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారాలను పొందాలన్నారు. మరిన్ని వివరాలకు 9000106774 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలన్నారు.
శ్రీవారిసేవలో సీఎస్
తిరుమల : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదివారం ఉదయం తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు, డైరీ, క్యాలెండర్‌ను ఈవో జె.శ్యామలరావు అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానంతరం టీటీడీ చైర్మన్ క్యాంప్ కార్యాలయానికి వెళ్లి, చైర్మన్ బీ.ఆర్.నాయుడును కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల టీటీడీలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయన సీఎస్‌కు వివరించారు. భక్తులకు టీటీడీ మరింత మెరుగైన సేవలు అందిస్తోందని సీఎస్‌కు వివరించారు.

నూతన ఎస్‌ఐలకు దిశా నిర్దేశం

నూతన ఎస్‌ఐలకు దిశా నిర్దేశం