
నిందితుని ఆచూకీ తెలిపితే రూ. 5లక్షలు నజరానా
వరదయ్యపాళెం: తమిళనాడులో సంచలనం కలిగించిన బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుని ఆచూకీ తెలిపిన వారికి రూ.5లక్షలు నజరానా ఇవ్వనున్నట్లు గుమ్మిడిపూండి డీఎస్పీ జయశ్రీ తెలిపారు. నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యల్లో భాగంగా వరదయ్యపాళెం మండలంలో పర్యటించిన డీఎస్పీ పత్రికా ప్రకటన ద్వారా వివరాలను తెలిపారు. తమిళనాడు రాష్ట్రం ఆరంబాకంలో ఓ బాలికను అపహరించి, లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడిని సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించామన్నారు. నలుగురు ఎస్పీల పర్యవేక్షణలో నాలుగు బృందాలుగా నిందితుడి కోసం గాలిస్తున్నట్లు ఆమె తెలిపారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి ప్రభుత్వం తరఫున రూ. 5లక్షలు నజరానా ఇస్తామని ఆమె వివరించారు. 9952060948 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ కోరారు.
లైంగిక దాడికి పాల్పడిన నిందితుని చిత్రం