
కార్డియాలజిస్ట్‌గా రాణించాలని..
తిరుపతిలో నివాసం ఉంటూ చంద్రగిరిలో నాన్న హేమంత్‌కుమార్ పోస్టల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. జాతీయ స్థాయి ఓపెన్ విభాగంలో 2567వ ర్యాంకు, కేటగిరి విభాగంలో 587వ ర్యాంకు సాధించా. మా నాన్న గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నారు. అలాంటి వారికి చికిత్సలు అందించాలన్నదే నా లక్ష్యం. – మౌనిక, నీట్ ర్యాంకర్, తిరుపతి
పేదలకు నాణ్యమైన వైద్యం
మంచి వైద్యుడిగా పేదలకు సేవలందించడమే నా లక్ష్యం. మాది తిరుపతి పట్టణం. నాన్న మహే శ్ సివిల్ ఇంజినీర్. నీట్‌లో ఓపెన్ విభాగంలో జాతీయ స్థాయి 4,747వ ర్యాంకు కేటగిరి విభాగంలో 114వ ర్యాంకు సాధించా. సుదర్శన్ అగర్వాల్ స్ఫూర్తితో వైద్య సేవలదిస్తా.
–కుంచెపు విశ్వక్ అగర్వాల్, నీట్ ర్యాంకర్, తిరుపతి
ఎయిమ్స్‌లో చదవాలని
దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ విద్యా సంస్థలో వైద్య విద్య అభ్యసించడమే నా లక్ష్యం. నాన్న డాక్టర్ కిరణ్, అమ్మ శైలజ ఇద్దరూ వైద్యులే.. నీట్‌లో ఓపెన్/కేటగిరి విభాగంలో 337వ ర్యాంకు సాధించా. ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసి మంచి వైద్యుడిగా సేవలందించడమే ధ్యేయం. – ఓ.ఆరుష్ లక్ష్మణ్
మంచి వైద్యుడిగా సేవలందిస్తా
వైద విద్యనభ్యసించి మంచి వైద్యుడిగా సేవలందించడమే నా లక్ష్యం. అమ్మా నాన్న డాక్టర్ ఈశ్వర్, డాక్టర్ శాంతకుమారి ఇద్దరూ డెంటల్ సర్జన్లు. నీట్‌లో ఓపెన్/కేటగిరి విభాగంలో 1042వ ర్యాంకు సాధించా. ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్‌లో వైద్య విద్య పూర్తి చేసి మంచి వైద్యుడిగా సేవలందిస్తా. –వి.యశ్వంత్, నీట్ ర్యాంకర్, తిరుపతి

కార్డియాలజిస్ట్‌గా రాణించాలని..

కార్డియాలజిస్ట్‌గా రాణించాలని..

కార్డియాలజిస్ట్‌గా రాణించాలని..