గురుకులం విద్యార్థికి అవార్డు | - | Sakshi
Sakshi News home page

గురుకులం విద్యార్థికి అవార్డు

May 15 2025 2:06 AM | Updated on May 15 2025 2:06 AM

గురుక

గురుకులం విద్యార్థికి అవార్డు

వెంకటగిరి రూరల్‌ : పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రెండో స్థానం దక్కించుకున్న గురుకుల బాలికల పాఠశాలకు విద్యార్థిని కలపాటి ఇంద్రజ షైనింగ్‌ స్టార్‌ అవార్డుకు ఎంపికై ంది. బుధవారం ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో విద్యార్థినికి కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ల్యాప్‌టాప్‌ అందించారు. అలాగే డీఈఓ కేవీఎన్‌ కుమార్‌, ఎంఈఓలు వెంకటేశ్వర్లు, బాబయ్య, ప్రిన్సిపల్‌ రజని అభినందనలు తెలిపారు.

అర్హులందరికీ రుణాలు

తిరుపతి అర్బన్‌ : అర్హులందరికీ రుణాలు మంజూరు చేయాలని లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ రవికుమార్‌ను కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఆదేశించారు. లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌గా రవికుమార్‌ బాధ్యతలు చేపట్టిన అనంతరం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.

నర్సింగ్‌ కళాశాల

ప్రిన్సిపల్‌కు అవార్డు

తిరుపతి సిటీ : విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం అంతర్జాతీయ నర్సింగ్‌ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నర్సింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ గంగా భవానీకి ఉత్తమ నర్సింగ్‌ పరిశోధకులు అవార్డు ప్రదానం చేశారు. ఆగ్యోగశాఖ మంత్రి చేతుల మీదుగా ఆమె అవార్డును అందుకున్నారు. బుధవారం ఈ మేరకు వర్సిటీలో వీసీ ప్రొఫెసర్‌ ఉమ, రిజిస్ట్రార్‌ రజని అభినందనలు తెలిపారు.

గురుకులం విద్యార్థికి అవార్డు 1
1/2

గురుకులం విద్యార్థికి అవార్డు

గురుకులం విద్యార్థికి అవార్డు 2
2/2

గురుకులం విద్యార్థికి అవార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement