వెటర్నరీ కళాశాలలో వీసీఐ బృందం
తిరుపతి సిటీ : ఎస్వీ వెటర్నరీ కళాశాలలో వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (వీసీఐ) బృందం బుధవారం పర్యటించింది. సుమారు 10విభాగాలను పరిశీలించింది. అధ్యాపకుల వివరాలు, తరగతి గదులు, పాఠ్యాంశాల బోధనపై వివరాలు సేకరించింది.
భవితకు నైపుణ్యమే ప్రధానం
తిరుపతి అర్బన్ : భవిష్యత్ ఉత్తమంగా ఉండాలంటే నైపుణ్యం పెంపొందించుకోవాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ, నాస్సాకామ్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన విద్యార్థులు, ఏపీఎస్‌ఎస్‌డీసీ కో–ఆర్డినేటర్లకు బుధవారం కలెక్టరేట్‌లో సర్టిఫికెట్లు, బ్యాడ్జెస్ పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచం డిజిటల్ వైపు నడుస్తుందని, సాంకేతిక అంశాలను జోడించి ప్రత్యేక నైపుణ్యత సాధించిన వారికి చక్కటి భవిష్యత్ ఉంటుందని వెల్లడించారు. నాస్సాకామ్ డైరెక్టర్ ఉదయశంకర్, నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి లోకనాథం పాల్గొన్నారు.
నేడే డీఎస్సీ దరఖాస్తుకు ఆఖరు గడువు
తిరుపతి సిటీ : టీచర్ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వ విడుదల చేసిన డీఎస్సీ–2025కు దరఖాస్తుల స్వీకరణ గురువారంతో ముగియనుంది. ఈనెల 30వ తేదీ నుంచి హాల్‌టికెట్లను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకును అవకాశం ఉంటుంది. జూన్ 6వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు.
వెటర్నరీ కళాశాలలో వీసీఐ బృందం


