బైక్‌ను ఢీకొన్న కారు
– ఇద్దరికి తీవ్ర గాయాలు
చంద్రగిరి: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో ఇద్దరు గాయపడిన ఘటన పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి పనపాకం వద్ద ఆదివారం చోటుచేసుకుంది. తిరుపతికి చెందిన సహదేవ్, అల్తాఫ్ పలమనేరు నుంచి తిరుపతి వైపుగా బుల్లెట్ వాహనంపై వస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతికి చెందిన మురళి తిరుపతి నుంచి చిత్తూరు వైపుగా కారులో వెళ్తున్నాడు. ముందు వెళ్తున్న వాహనాన్ని అదిగమించబోయి ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో సహదేవ్‌తో పాటు అల్తాఫ్ తీవ్రంగా గాయపడ్డారు. 108 సిబ్బంది క్షతగాత్రులను తిరుపతి రుయాకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
చికిత్సపొందుతూ మహిళ మృతి
తిరుపతి రూరల్ : అగ్నిప్రమాదంలో గాయపడి చికిత్సపొందుతున్న మహిళ ఆదివారం మృతి చెందింది. వివరాలు.. తిరుపతి రూరల్ మండలం పైడిపల్లెకి చెందిన ఆనందమ్మ (65) ఈనెల 9వ తేదీన దీపం తగిలి చీరకు నిప్పు అంటుకోవడంతో గాయపడింది. రుయా ఆస్పత్రిలో రెండురోజులుగా చికిత్సపొందుతూ మరణించింది. మృతురాలి కుమారుడు విజయ్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ షేక్‌షావల్లీ తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం చేయించి కుటుంబీకులకు అప్పగించినట్లువ వెల్లడించారు.


