
హనుమంత వాహనంపై ఊరేగుతున్న లక్ష్మీనరసింహుడు(ఇన్‌సెట్) ఆ
జిల్లా సమాచారం
మండలాలు: 33
పంచాయతీలు: 806
ఉపాధి కూలీలు: 2.12 లక్షలు
పశువులకు నీటి తొట్టలకు అనుమతులు: 2.636
పూర్తి చేసినవి: 966
గొర్రెలు, పశువులకు
సంబంధించిన షెడ్లు: 1647
పూర్తి చేసినవి: 1278
సోప్ పిట్‌లు(రూ.6 వేల విలువతో): 12,344
పూర్తి చేసినవి: 6,568
జిల్లాలో ఉపాధి హామీ పథకం నిధుల్లేక నీరసిస్తోంది. చేసిన పనులకు బిల్లులు ఇవ్వక కూలీలు డొక్కలు మాడ్చుకోవాల్సి వస్తోంది. అప్పులు చేసి నిర్మించిన నీటి తొట్టలకు వడ్డీలు కట్టలేక అవస్థలు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. గత మూడు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొన్నా కూటమి ప్రభుత్వం సమస్యను పరిష్కరించకపోవడం విమర్శలకు తావిస్తోంది.
చిల్లకూరు: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కూటమి ప్రభుత్వం నీరుగారుస్తోంది. పనులు చేసి మూడు నెలలవుతున్నా ఇంతవరకు బిల్లులు మంజూరు కాలేదని కూలీలు ఆవేదన చెందుతున్నారు. ఉపాధి పథకం కింద గత ఐదు నెలలుగా చేపట్టిన ఏ ఒక్క పనికీ పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయలేదని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు.
మేం చూడం బాబోయ్!
కూటమి నాయకులు నిబంధనలు పాటించకుండా.. నాణ్యతా ప్రమాణాలు గాలికొదిలేసి గ్రామాల్లో ఇష్టానుసారంగా సీసీ రోడ్లు, డ్రైన్‌లు నిర్మించారు. వీటికి పూర్తి స్థాయి నగదు చెల్లింపులు జరగాలంటే క్వాలిటీ కంట్రోల్ అధికారులు పరిశీలించాలి. వీటిని ఎక్కడ ఓకే చేస్తే సోషల్ ఆడిట్‌లో తమ మెడకు చుట్టుకుంటుందోనని వారు మిన్నకుండిపోతున్నట్టు సమాచారం. ఫలితంగా బిల్లుల మంజూరులో జాప్యం జరుగుతున్నట్టు సమాచారం.
కూటమి నేతలకే నీటితొట్టెలు
ఉపాధి పథకం కింద పశువులు ఉన్న రైతులకు షెడ్‌లు, మూగజీవాల పెంపకందారులకు నీటి సౌకర్యం కోసం నీటి తొట్టెలు కూటమి నేతలే సొంతం చేసుకున్నారు. ఒక్కో షెడ్డుకు రూ.2 లక్షల వరకు మంజూరు చేయాల్సి ఉంది. అయితే జీఎస్‌టీ బిల్లులు పెడితేనే పూర్తి స్థాయిలో బిల్లులు మంజూరు చేస్తామని అధికారులు తేల్చిచెప్పారు. లేకుంటే రూ.1.4 లక్షలు మంజూరు చేస్తామని మెలికపెట్టడంతో కూటమి నేతలు బావురమంటున్నారు.
వేధిస్తున్న నిధుల కొరత
సిబ్బందికి జీతాల్లేవ్
కూలీలకు వేతనాలూ కరువు
చేసిన పనులకు బిల్లులు చెల్లింపులు లేవు
మేకపోతు గాంభీర్యం చూపుతున్న కూటమి నేతలు
అప్పులు చేసి పనులు చేసినా..!
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాల్లో ఆ పార్టీల నాయకులు ఇబ్బడిముబ్బడిగా సీసీ రోడ్లు, క్యాటిల్ షెడ్లు, సీసీ డ్రైన్లు నిర్మించారు. మొదట్లో కొంత నగదు మంజూరు కావడంతో జబ్బలు చరిచారు. ఆపై పనులు పూర్తి చేసి ఐదు నెలలుకుపైగా అవుతున్నా పూర్తి స్థాయిలో బిల్లు లు రాకపోవడంతో లబోదిబోమంటున్నారు.

హనుమంత వాహనంపై ఊరేగుతున్న లక్ష్మీనరసింహుడు(ఇన్‌సెట్) ఆ

హనుమంత వాహనంపై ఊరేగుతున్న లక్ష్మీనరసింహుడు(ఇన్‌సెట్) ఆ