
కాపునాడు ఉమ్మడి జిల్లా మహిళా అధ్యక్షులుగా రాధ
తిరుపతి కల్చరల్ : కాపునాడు సే వా సమితి ఉమ్మడి చిత్తూరు జి ల్లా మహిళా విభాగం అధ్యక్షు లుగా దామా రాధా నియమితు లయ్యారు. శుక్రవారం ఈమేర కు సమితి జిల్లా అధ్యక్షుడు మధురాయల్ ఆధ్వర్యంలో పసుపులేటి హరిప్రసాద్ చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు. హరిప్రసాద్ మట్లాడుతూ 200 మంది మహిళలతో కాపునాడు సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో కాపునాడు జిల్లా అధికార ప్రతినిధి తుపాకుల మురళి, వర్కింగ్ ప్రెసిడెంట్ జ్ఞాన చంద్ర, పగడాల సునీల్ రాయల్ పాల్గొన్నారు.
కోదండరామునికి ‘కియోస్క్’ బహూకరణ
తిరుపతి కల్చరల్ : శ్రీకోదండరామస్వామి ఆలయానికి శుక్రవారం కియోస్క్ యంత్రాన్ని సౌత్ ఇండియన్ బ్యాంక్ విరాళంగా అందించింది. ఈ క్యూ ఆర్ కోడ్ యంత్రంతో యూపీఐ మోడ్‌లో రూ.లక్ష వరకు భక్తులు విరాళంగా అందజేయవచ్చు. ఇప్పటికే సౌత్ ఇండియా బ్యాంక్ ప్రతినిధులు ఒక కియోస్క్ మిషన్ అందించారు. కియోస్క్ మిషన్లను తిరుమల అన్నదానం, పద్మావతి గెస్ట్ హౌస్, సీఆర్‌ఓ ఆఫీస్, దేవుని కడప, శ్రీగోవిందరాజస్వామి ఆలయం, అమరావతి, ఒంటి మిట్ట, పద్మావతీదేవి ఆలయం, వకుళామాత ఆలయం, కపిలతీర్థం ఆలయం, హైదరాబాద్, చైన్నె, బెంగళూరు, విజయవాడలో టీటీడీ వినియోగిస్తోంది. బ్యాంక్ ప్రతినిధులు ఏవీ నిరంజన్, ఆర్.వెంకటరావు, డి.అశోక్ వర్ధన్, ఆలయ డిప్యూటీ ఈఓ బి.నాగరత్న, ఐటీ డీజీఎం బి.వెంకటేశ్వర్లు ,ఏఈఓ బి.రవి, సూపరింటెండెంట్ డి.మునిశంకర్ పాల్గొన్నారు.
వైన్‌షాపులపై నిరంతరం నిఘా
తిరుపతి క్రైమ్ : జిల్లాలోని వైన్‌షాపులపై నిరంతరం నిఘా ఉంటుందని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ నాగమల్లేశ్వర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 11 ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 250 మద్యం దుకాణాలు ఉన్నాయన్నారు. ఈ మేరకు అధికారులు, సిబ్బంది బృందాలు ఏర్పడి కేటాయించిన ప్రాంతాల్లోని వైన్‌షాపులపై నిఘా పెడతారని వెల్లడించారు. దుకాణాలు తెరిచే సమయం, మూసే వేళలను గమనిస్తారని చెప్పారు. అలాగే వైన్‌షాపుల పక్కన అనధికా పర్మిట్‌రూమ్‌లను అరికట్టేందుకు కేసులు సైతం నమోదు చేస్తామని హెచ్చరించారు. మద్యం దుకాణాల యజమానులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

కాపునాడు ఉమ్మడి జిల్లా మహిళా అధ్యక్షులుగా రాధ