
బదిలీలు.. బెదిరింపులు!
తిరుపతి అర్బన్ : జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులకు బ దిలీల గుబులు పట్టుకుంది. ట్రాన్స్‌ఫర్ కోసం దరఖా స్తు చేసుకోవాలని కూటమి నేతలు బెదిరిస్తున్నట్లు ఉద్యోగ వర్గాల్లో చర్చ సాగుతోంది. బదిలీ కోరకుంటే సస్పెండ్ చేయిస్తామని ఎమ్మెల్యేలు హెచ్చరిస్తున్నట్లు పలువురు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. దీంతో చేసేదిలేక ప్రధానంగా రెవెన్యూ, అగ్రిక ల్చర్ విభాగాలకు చెందిన ఉద్యోగులు కొందరు బదిలీకి దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది సెప్టెంబర్‌లో 15 విభాగాల చెందిన వారికి మాత్రమే బదిలీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి అన్ని విభాగాల్లోనూ ట్రాన్స్‌ఫర్లు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కీలకమైన అన్ని పోస్టుల్లో ను ఒకే సామాజిక వర్గానికి చెందినవారినే కూర్చోబెట్టనున్నట్లు ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.
మనోడై ఉండాల్సిందే!
మన ప్రాంతానికి వచ్చే రెవెన్యూ అధికారి మనోడై ఉండాల్సిందే అని జిల్లాలోని ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నట్లు సమాచారం. అలాగే చెప్పిన మాట వినే వారికే కీలక పోస్టులు ఇప్పించాలని యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా తిరుపతితోపాటు శ్రీకాళహస్తి, చంద్రగిరి, వెంకటగిరి,సూళ్లూరుపేట, గూడూరులోని ప్రజా ప్రతినిధులు తమ వారిని తెచ్చుకునేందుకు గట్టిగానే పనిచేస్తున్నట్లు చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే గతంలో తూర్పు మండలాల్లో పనిచేసిన ఇద్దరు తహసీల్దార్లపై అవినీతి ఆరోపణలు తీవ్రంగానే ఉన్నాయి. అయితే కూటమి నేతలకు రూ.కోట్ల ముడపులు చెల్లించి తిరుపతిలో కీలకమైన రెవెన్యూ పోస్టును సంపాదించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు సదరు అధికారులు సైతం ‘‘అవును తిరుపతికి వచ్చేస్తున్నాం. కేవలం వారం రోజులు ఆగండి...ఆ తర్వాత అంతా కలసి చేసుకుందాం. ఇప్పటికే పెద్ద మొత్తంలో ప్రజా ప్రతినిధులకు ఇచ్చుకోవాల్సి వచ్చింది. దానికి రెండు మూడు రెట్లు సంపాదించుకుందాం’’ అంటూ పలువురు సిబ్బందితో వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుతం జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న రెవెన్యూ అధికారులు ‘‘ఔను...బదిలీల ప్రచారం వాస్తవమే నేను కూడా వెళ్లిపోతున్నా.. కూటమి నేతలు చెప్పిందల్లా నేను చేయలేను...బదిలీనే మేలని భావిస్తున్నా.. అసలే ప్రమోషన్ జాబితాలో ఉన్నాం.. వాళ్ల అవినీతికి వంతపాడితే ఇరుక్కుంటా’’ అని తమ వద్దకు వచ్చే వారితో చెబుతున్నట్లు తెలిసింది.
అదనపు మార్గదర్శకాలు
బదిలీలకు సంబందించి తాజాగా పంచాయతీరాజ్‌శాఖకు అదనపు మార్గదర్శకాలను శుక్రవారం విడుదల చేశారు. ప్రధానంగా కార్యదర్శలు 50శాతం కంటే తక్కువ పన్నులు వసూలు చేసి ఉంటే వారిని నాన్ ఫోకల్ పంచాయతీలకు (ఆదాయవనరులు తక్కువ ఉండేవి)బదిలీ చేయాలని పేర్కొన్నారు., ఐదేళ్లు సర్వీస్ పూర్తి చేసినవారితోపాటు డిప్యూటీలో సర్వీస్ ఉన్నప్పటికీ ట్రాన్స్‌ఫర్ చేయాలని నిర్ణయించారు. కింది స్థాయి ఉద్యోగులు సొంత మండలం, డివిజన్ స్థాయివారు సొంత డివిజన్‌లోను , జిల్లా స్థాయి ఉద్యోగులు సొంత జిల్లాలోను పనిచేయకూడదని ఉత్తర్వుల్లో వెల్లడించారు. అలాగే విజిలెన్స్ కేసులు, తీవ్రమైన ఆర్థిక ఆరోపణలు ఉన్న పంచాయతీ కార్యదర్శలను అదే గ్రేడ్‌లోని నాన్ ఫోకల్ గ్రామ పంచాయితీకి బదిలీ చేయాలని ఆదేశించారు.
ఆందోళనలో ఉద్యోగులు
ట్రాన్స్‌ఫర్‌కు దరఖాస్తు చేసుకోవాలని పలువురిపై ఒత్తిడి
చక్రం తిప్పుతున్న కూటమి నేతలు
మాట వినే వారికే కీలక పోస్టులు
సిఫార్సుల జోరు
కీలకమైన శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ము డుపులు చెల్లించుకుని బదిలీలకు సన్నద్ధమవుతున్న ట్లు తెలుస్తోంది. అయితే కింది స్థాయికి చెందిన ఉ ద్యోగులు మాత్రం కూటమి నేతల నుంచి సిఫార్సు లెటర్లు తెస్తున్నట్లు సమాచారం, చిరుద్యోగుల నుంచి సీనియర్ అసిస్టెంట్ల వరకు ఉమ్మడి జిల్లాల పరిధిలోనే బదిలీలు చేపడుతున్నారు. గెజిటెడ్ స్థాయి నుంచి డివిజన్, జిల్లా స్థాయి అధికారులను జోన్– 4 పరిధిలో ట్రాన్స్‌ఫర్ చేయనున్నారు. జోన్–4 పరిధిలో ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కర్నూలు, వై ఎస్సార్ కడప జిల్లాలు వస్తాయి. ఈ క్రమంలో అధికారులు వారికి అనుకూలమైన జిల్లాను ఎంపిక చే సుకుంటున్నారు. మొత్తంగా బదిలీల జాబితాలోని ఉద్యోగులకు జూన్ 2 వరకు టెన్షన్ తప్పేలా లేదు. అర్హుతే ప్రామాణికంగా తీసుకుని బదిలీ చేస్తారా.. లేదా కూటమి నేతల లేఖలకే ప్రాధాన్యత ఇస్తారా వేచి చూడాల్సిందే.
వ్యవసాయశాఖలోనూ అదే పరిస్థితి
ప్రస్తుతం వ్యవసాయశాఖతోపాటు వాటి అనుబంధశాఖల్లో బదిలీలు చేపట్టనున్నారు. ప్రధానంగా బదిలీ చేయడానికి ఐదేళ్లు సర్వీస్ పూర్తయ్యి ఉండాలి. లేదా వారే వెళ్లిపోవాలంటే కనీసం రెండేళ్లు సర్వీస్ ఉంటేనే బదిలీకి దరఖాస్తు చేసుకోవాలి. ఏడాదిలో ఉద్యోగ విరమణ ఉంటే వారికి బదిలీ నుంచి మినహాయింపు ఉంటుంది. ఈ మూడు అంశాలను బదిలీల సమయంలో పాటించాలి. అయితే కూటమి నేతలు తెలివిగా రెండేళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న వారిని బలవంతంగా బదిలీ పెట్టుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది . లేదంటే సస్పెండ్ చేయిస్తామని హెచ్చరిస్తున్నట్లు చర్చ సాగుతోంది. దీంతో అధికారులు సస్పెండ్ కావడం కన్నా బదిలీపై వెళ్లడమే ఉత్తమంగా భావిస్తున్నారు.