
యూపీఎస్సీ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు
తిరుపతి అర్బన్ : యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలకు పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎస్పీ హర్షవర్థన్‌రాజు, యూపీఎస్సీ అబ్జర్వర్ హన్సవదన, సంయుక్త కార్యదర్శి ఎన్‌జీ అజ్మీరతో కలసి సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆదివారం నిర్వహించనున్న పరీక్షలకు జిల్లాలో 13 సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. 12 ప్రభుత్వ కళాశాలలు, ఒక ప్రైవేటు కళాశాలను సెంటర్‌గా ఎంపిక చేసినట్లు వెల్లడించారు. మొత్తం 5261 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకారనున్నట్లు వివరించారు. యూపీఎస్సీ ఎగ్జామినేషన్‌ను ఉదయం 9.30 గంటల నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు రెండు సెషన్లుగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఒక్క నిమిషం ఆలస్యమైన కేంద్రంలోకి అనుమతించమని స్పష్టం చేశౠరు. ఎగ్జామ్ సెంటర్ల వద్ద ఇంటర్నెట్, జిరాక్స్ షాపులను మూసివేయాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రంలోకి మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ వాచ్‌లు, పరికరాలను తీసుకెళ్లకూడదని కోరారు. అభ్యర్థుల రాకపోకలకు ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ ఇప్పటికే పరీక్షలకు సంబంధించి భద్రతా అంశాలపై పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. సమావేశంలో డీఆర్‌ఓ నరసింహులు, తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ చరణ్ తేజ్, డీఎంహెచ్‌ఓ బాలకృష్ణ నాయక్, డ్వామా ిపీడీ శ్రీనివాస రావు, డీఆర్‌డీఏ పీడీ శోభన్‌బాబు, విద్యుత్‌శాఖ అధికారి సురేంద్ర నాయుడు, జిల్లా కో–ఆపరేటివ్ అధికారిరి లక్ష్మి, ఆర్‌టీసీ రీజనల్ మేనేజర్ వెంకట్రావ్ పాల్గొన్నారు.