
ప్రభుత్వ తీరుపై ఆర్టీసీ ఉద్యోగుల ఆవేదన
తిరుపతి అర్బన్ : ఆర్‌టీసీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మంగళం డిపోకు చెందిన ఈయూ ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు చెల్లించాల్సిన పీఆర్‌సీ, అరియర్స్, డీఏలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. 10వేలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని...అయినా వాటిని భర్తీ చేయడం లేదన్నారు. దీంతో ఉద్యోగులపై అదనపు భారం పడుతోందని వెల్లడించారు. అద్దె బస్సులను తీసుకోవడంతోనే కాలయాపన చేస్తున్నారని, కొత్త బస్సులను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుంటే పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. సమావేశంలో ఈయూ నేతలు రెడ్డెప్ప, వీఆర్ కుమార్, అర్జున్, సతీష్‌నాయుడు, మురగమ్మ, మస్తాన్, సత్యనారాయణ, గురున్నాథం, సుభ్రమణ్యం, రఘు, మధు, శేషాద్రి పాల్గొన్నారు.
నూతన కమిటీ ఏర్పాటు
మంగళం డిపో ఈయూ కొత్త కమిటీ ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా బి.శేషాద్రి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేఎస్ వాసు, చీఫ్ వైస్ ప్రెసిడెంట్‌లుగా ఎంఎస్ రెడ్డి, ఎం.మోహన్ నాయుడు, డిపో సెక్రటరీ టీవీ బాబు, జాయింట్ సెక్రటరీ చిరంజీవి, ప్రచార కార్యదర్శి బి.బాలాజీ, ట్రెజర్ విశ్వనాధ్, అసిస్టెంట్ సెక్రటరీగా రేఖా మరో ముగ్గురు ఉపాధ్యక్షులు, ముగ్గురు ఆర్గనైజింగ్ సెక్రటరీలు, ముగ్గురు అసిస్టెంట్ సెక్రటరీలతో కమిటీని ఎంపిక చేశారు.