ప్రజాసమస్యల పరిష్కారవేదికకు ఇబ్బడిముబ్బడిగా అర్జీలు | - | Sakshi
Sakshi News home page

ప్రజాసమస్యల పరిష్కారవేదికకు ఇబ్బడిముబ్బడిగా అర్జీలు

Mar 18 2025 12:41 AM | Updated on Mar 18 2025 12:39 AM

● కూమిట ప్రభుత్వంలో ఇంతవరకు అందని కొత్త పింఛన్లు ● అర్జీల స్వీకరణకే పరిమితమవుతున్న అధికారులు ● కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న అభాగ్యులు ● కలెక్టరేట్‌కొచ్చినా కనికరం లేదంటూ నిట్టూర్పులు

భర్త చనిపోయాడు!

● వాకాడు మండలానికి చెందిన బత్తెల కమలమ్మ భర్త తొమ్మిది నెలల క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి వితంతు పింఛన్‌ కోసం అర్జీ పట్టుకుని తిరగని కార్యాలయం లేదు. కలవని అధికారి లేడు. తీరా సోమవారం కలెక్టరేట్‌కు వచ్చారు. భర్త చనిపోయి ఆర్థికంగా చితికిపోయినట్టు వెల్లడించారు. ‘ఓకే మేము పరిశీలిస్తాం.. సంబంధిత అధికారికి పంపుతాం..’ అంటూ అధికారులు సమాధానం ఇచ్చి పంపారు. ఎక్కడికెళ్లినా పరిష్కారమార్గం చూపడం లేదని ఆమె ఆవేదనతో వెనుదిరిగారు.

● శ్రీకాళహస్తికి చెందిన పి.నరసింహారెడ్డి స్వర్ణముఖి పరిసర ప్రాంతాల్లోని శ్మశానాన్ని కొందరు ఇసుకాసురులు తవ్వేస్తున్నారని కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. గతంలో పలుమార్లు శ్రీకాళహస్తి ఆర్డీఓ, ఎమ్మార్వో కార్యాలయాల్లో తెలియజేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. స్వర్ణముఖి నదీతీర ప్రాంతంలో మకాం వేసి శ్మశానాన్ని సైతం వదలడం లేదని పేర్కొన్నారు. శ్మశానాన్ని పరిరక్షించాలని వినతి పత్రం సమర్పించారు. ‘సరే..అధికారులకు పంపుతాం’ అంటూ ఫిర్యాదుదారునికి రిసిప్ట్‌ ఇచ్చి పంపారు.

శ్మశానానికి దారేది?

షరామామూలే

సోమవారం జరిగిన గ్రీవెన్స్‌ కూడా తూతూమంత్రంగా నిర్వహించి చేతులు దులుపుకున్నారు. ఎండ వేడిమికి తట్టుకోలేక అంధులు, వికలాంగులు, పండుటాకులు, చంటిబిడ్డ తల్లులు విలవిల్లాడడం కనిపించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు 36,606 అర్జీలు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. ఇందులో 74 శాతం సమస్యలు పరిష్కారమైనట్టు లెక్కలు చెప్పారు. వాస్తవంగా ఇందులో 30 శాతానికి మించి సమస్యలు పరిష్కారం కాలేదని అర్జీదారులు చర్చించుకోవడం కనిపించింది.

పరిష్కారమేదీ?

వచ్చిన వినతులపై సంతకం చేయడం .. రిసిప్ట్‌ అందించడం మాత్రమే చేస్తున్నారు. సోమవారం వచ్చిన సుమారు 250 అర్జీలలో 165 వినతులు రెవెన్యూకు సంబంధించినవి ఉన్నట్టు తేల్చారు. వాటికి పరిష్కారం చూపలేదు. మీ మొబైల్‌కు ఫోన్‌ వస్తుందని మాత్రమే సమాధానం చెప్పి పంపించేశారు.

ప్రజాసమస్యల పరిష్కారవేదికకు ఇబ్బడిముబ్బడిగా అర్జీలు 
1
1/1

ప్రజాసమస్యల పరిష్కారవేదికకు ఇబ్బడిముబ్బడిగా అర్జీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement