అవినీతి అంతస్తులు | - | Sakshi
Sakshi News home page

అవినీతి అంతస్తులు

Mar 17 2025 12:27 AM | Updated on Mar 17 2025 12:27 AM

అవినీ

అవినీతి అంతస్తులు

తిరుపతి తుడా: తిరుమల బైపాస్‌ రోడ్డులోని ఎస్‌బీఐ ఎటీఎం ఎదురుగా 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. కూటమి నేతల అండతో నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే ఆరు అంతస్తుల భారీ భవనం నిర్మిస్తున్నా అటువైపు ఎవ్వరూ కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. అక్రమ నిర్మాణంతో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆదాయానికి సుమారు రూ.2 కోట్ల మేర గండి పడుతోంది. సెల్లార్‌, గ్రౌండ్‌ ఫ్లోర్‌ తో పాటు ఆరు అంతస్తులతో టౌన్‌ప్లానింగ్‌ అనుమతి లేకుండా భవనం కడుతున్నా అడ్డుకునేవారు కరువయ్యా రు. కొంతమంది టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు కాసుల కక్కుర్తితో అక్రమ నిర్మాణానాలకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

20న ఎన్‌ఎస్‌యూ స్నాతకోత్సవం

తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత యూనివర్సిటీ స్నాతకోత్సవాన్ని ఈనెల 20వ తేదీన ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు మహతి ఆడిటోరియంలో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ సంస్కృత వర్సిటీగా విద్యాపీఠం రూపాంతరం చెందిన నాటి నుంచి ఇప్పటి వరకు మూడు స్నాతకోత్సవాలు నిర్వహించారు. అదే స్ఫూర్తితో నాలుగో స్నాతకోత్సవాన్ని వైభవోపేతంగా జరింపించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

నేటి నుంచి ఇంటర్‌ మూల్యాంకనం

తిరుపతి ఎడ్యుకేషన్‌:తిరుపతిలోని ఎస్వీ జూనియ ర్‌ కళాశాలలో సోమవారం నుంచి ఇంటర్‌ మూ ల్యాంకనం చేపట్టనున్నట్లు ఆర్‌ఐఓ జీవీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఈ నెల 17నుంచి ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌, తెలుగు, సివిక్స్‌, తమిళ మీడియం, ఒకేషనల్‌ జవాబుపత్రాల వాల్యుయేషన్‌ ఉంటుందన్నారు. 22 నుంచి ఫిజిక్స్‌, బోటనీ, హిస్టరీ, తమిళ మీడియం, ఒకేషనల్‌ సబ్జెక్టులు, 24నుంచి కెమిస్ట్రీ, కామర్స్‌, ఎకనామిక్స్‌, 26వ తేదీ నుంచి జువాలజీ మూల్యాంకనం జరుగుతుందని వివరించారు.

42వ రోజుకు చేరిన జూడాల సమ్మె

తిరుపతి సిటీ:గౌరవవేతనం పెంచాలంటూ ఎస్వీ వెటర్నరీ వర్సిటీ జూడాలు చేస్తున్న సమ్మె ఆదివారానికి 42వ రోజుకు చేరింది. వారు మాట్లాడుతూ ప్రభుత్వం తమ ఆవేదనను అర్థం చేసుకోకపోవడం దారుణమన్నారు. గౌరవేతనం పెంచేవరకు సమ్మె విరమించేది లేదని హెచ్చరించారు.

● ఈమె పేరు మునెమ్మ. ఏర్పేడు మండలం బండారుపల్లె. 18 గుంటల పొలంలో వేరుశనగ, మరో 16 గుంటల్లో వరి సాగు చేపట్టారు. వేరుశనగ ఒబ్బిడి దశకు చేరుకుంది. మరో 10 రోజుల్లో పంట చేతికందే పరిస్థితుల్లో విద్యుత్‌ కోతల కారణంగా మొక్కలు ఎండుముఖం పట్టాయి. కేవలం 7 గంటలు మాత్రమే వ్యవసాయానికి కరెంట్‌ సరఫరా చేస్తుండడంతో ఆఖరి తడికి నీరు అందడం లేదు. దీంతో ఏం చేయాలో తెలియక మునెమ్మ కొట్టుమిట్టాడుతోంది.

ఈ దుస్థితి ఒక్క మునెమ్మకు మాత్రమే కాదు. జిల్లాలోని వేలాదిమంది అన్నదాత లకు దాపురించింది. 9 గంటల విద్యుత్‌ సంగతి దేముడెరుగు.. వచ్చే 7 గంటలు కూడా సక్రమంగా సరఫరా కాకపోవడంతో రైతులు తల్లడిల్లిపోతున్నారు. కళ్లెదుటే పంట ఎండిపోతుంటే కన్నీరు పెడుతున్నారు.

అవినీతి అంతస్తులు 1
1/2

అవినీతి అంతస్తులు

అవినీతి అంతస్తులు 2
2/2

అవినీతి అంతస్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement